ప్రేమ.. వినోదం | Chaitanya Rao And Hirthika Srinivas Movie Opening | Sakshi
Sakshi News home page

ప్రేమ.. వినోదం

Published Mon, Aug 7 2023 1:18 AM | Last Updated on Mon, Aug 7 2023 1:19 AM

Chaitanya Rao And Hirthika Srinivas Movie Opening - Sakshi

‘చైతన్య రావ్, హృతికా శ్రీనివాస్‌ జంటగా కొత్త సినిమా షురూ అయింది. సాయి తేజ దర్శకత్వంలో గౌతమ్స్‌ ఈగల్‌ ఎంటర్‌టైన్మెంట్‌పై ఎం.గౌతమ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది.ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ అనిల్‌ కూర్మాచలం కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాతలు సి.కల్యాణ్‌ క్లాప్‌ కొట్టగా, బెక్కం వేణుగోపాల్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

‘‘కామెడీ, లవ్, ఎమోషన్స్ .. వంటి ఆకట్టుకునే అంశాలు ఈ మూవీలో ఉంటాయి’’ అన్నారు ఎం.గౌతమ్‌. నిర్మాత రాచాల యుగంధర్‌  పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మోహన్‌ పున్న,లైన్‌ ప్రొడ్యూసర్‌: వంశీ కృష్ణ, కెమెరా: పీసీ మౌళి, సంగీతం: గ్యాని. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement