
సాక్షి, చిత్తూరు: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడపల్లెకు చెందిన లాన్స్‌నాయక్ బి.సాయితేజ అంత్యక్రియలు రేపు(ఆదివారం) నిర్వస్తామని ఆయన సోదరుడు మహేశ్‌బాబు తెలిపారు. శనివారం మధ్యాహ్నం సాయతేజ భౌతికకాయం బెంగళూరుకు చేరుతుందని, అనంతరం బెంగళూరు నుంచి తమ స్వగ్రామానికి రావడానికి సాయంత్రమవుతందని పేర్కొన్నారు. దీంతో సాయితేజ అంత్యక్రియలు రేపు ఉదయం చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
చదవండి: Sai Teja: సాయితేజ కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం
నేడు సాయి తేజ భౌతికకాయాన్ని ఆర్మీ బేస్ హాస్పిటల్‌లో ఉంచాలని అధికారులను కోరామని, దానికి అధికారులు అంగీకరించారని చెప్పారు. ఆదివారం ఉదయం 5 గంటలకు బయలుదేరి తమ స్వగ్రామనికి ఉదయం 10గంటల లోపు సాయ తేజ భౌతికకాయం చేరుతుందని తెలిపారు. శనివారం ఉదయం డీఎన్ఏ పరీక్షల ఆధారంగా సాయి తేజ భౌతికకాయాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం భౌతికకాయాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆస్పత్రిలో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి.. మిలటరీ లాంఛనాలతో సాయితేజ స్వస్థలాలకు భౌతికకాయాన్ని తరలించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment