
మాస్కో : కనిపించకుండా పోయిన ఓ విమానం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. రష్యాలోని తంబోవ్ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన విమానం సోమవారం సాయంత్రం బయలుదేరిన కాసేపటికే కమ్యూనికేషన్ వ్యవస్థతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో దాని గురించి అధికారులు వెతకటం ప్రారంభించారు.
అయితే తంబోవ్ ప్రాంతంలో దహనమౌతున్న వాటి శకలాలు గుర్తించిన స్థానికులు కొందరు సమాచారం అందించటంతో ఈ ప్రమాదం వెలుగులోకి వచ్చింది. పైలెట్లు ఇద్దరూ చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఘటనకు గత కారణాలు తెలియాల్సి ఉంది.