
మిలటరీ కార్ప్స్ చెందిన సీనియర్ అధికారులు ఉన్నారనీ...
కాబుల్ : అప్గనిస్తాన్‌లో ఓ సైనిక విమానం కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బుధవారం ఉదయం 9 గంటల 10 నిమిషాలకు పశ్చిమ ఫరా ప్రావిన్స్‌లో చోటుచేసుకుందని ప్రొవెన్షియల్ గవర్నర్ అధికార ప్రతినిధి నాసర్ మెహ్‌దీ తెలిపారు. కొండప్రాంతమైన అనార్ దారా జిల్లా నుంచి హెరాత్ ప్రావిన్స్‌కు బయల్దేరిన కొద్ది సేపటికే హెలికాప్టర్ ప్రమాదానికి గురైందన్నారు.
మృతుల్లో ఫరా ప్రావిన్స్ కౌన్సిల్ సభ్యులు సహా జాఫర్ మిలటరీ కార్ప్స్ చెందిన సీనియర్ అధికారులు ఉన్నారనీ... ఒక్కరు కూడా సజీవంగా బయటపడలేదని తెలిపారు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. గత సోమవారం ఇండోనేషియాలో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో 189 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఆత్మహుతి.. ఏడుగురి మృతి..
అఫ్గాన్‌లోని పుల్-ఇ-చర్ఖి జైలు బయట జరిగిన ఆత్మహుతి దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో జైలు భద్రతా సిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోయారని అధికారులు పేర్కొన్నారు.