
సాక్షి, న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారత వైమానిక దళం (ఐఏఎఫ్) హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు అధికారులు.. చాపర్‌లో ఉన్న మొత్తం ఏడుగురు ఐఏఎఫ్ సిబ్బంది ప్రాణాలు విడిచారు. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ప్రాంతంలో ఉదయం ఆరు గంటలకు ఐఏఎఫ్‌కు చెందిన ఎం-17 వీ5 చాపర్ కూలిపోయింది. ఐఏఎఫ్ ఫైలట్లు శిక్షణ పొందుతున్న ప్రక్రియలో భాగంగా ఎం-17 వీ5 చాపర్ ప్రమాదానికి గురైంది. ఈ చాపర్ కూలిపోవడానికి కారణం ఏమిటన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనకు సాంకేతికలోపాలు కారణమా? లేక ప్రతికూల వాతావరణ పరిస్థితులా? తెలియాల్సి ఉంది.