
కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలో హెలికాప్టర్ కూలిపోయిన ఘటన విషాదాన్నినింపింది. మారుమూల ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కేఎస్‌టీవీ స్టేషన్ డిపార్ట్‌మెంట్ ధ్రువీకరించింది.
ది రాబిన్సన్ ఆర్66 అనే హెలికాప్టర్ ఆదివారం మధ్యాహ్నం 1.15 సమయంలో శాక్రమెంటోకు ఉత్తరాన కొలూసా కౌంటీలో ప్రాంతంలో కుప్పకూలింది. ఈ మేరకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించిన విషయాన్ని ధృవీకరించినప్పటికీ, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం నలుగురు వ్యక్తులు చనిపోయినట్టుగా తెలుస్తోందని అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డులు ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment