deceived
-
ఫస్ట్‌డేట్ రోజే విషాదం: టిక్‌టాక్ స్టార్ కాల్చివేత
కాలిఫోర్నియా: అమెరికాలోని కరోనా థియేటర్లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన టిక్‌టాక్ స్టార్ ఆంథోనీ బరాజాస్ (19) తుది శ్వాస విడిచాడు. గతం వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆంథోనీ మెదడులోని తీవ్ర గాయాల కారణంగా చనిపోయినట్టు కాలిఫోర్నియా పోలీసులు ప్రకటించారు. గత నెల 26 న దక్షిణ కాలిఫోర్నియాలోని కరోనా థియేటర్లో హారర్ మూవీ "ది ఫరెవర్ పర్జ్" ప్రదర్శిస్తున్న సమయంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సినిమా ముగిసిన తర్వాత, ఆడిటోరియం శుభ్రం చేస్తున్నథియేటర్ ఉద్యోగులు రక్తపు మడుగులో పడిఉన్న ఇద్దరు బాధితులను గుర్తించారని రివర్సైడ్ కౌంటీ ప్రాసిక్యూటర్ మైక్ హెస్ట్రిన్ ఒక ప్రకటనలో తెలిపారు. చాలా సమీపంనుంచి ఇద్దర్నీ తలపై గురిపెట్టి మరీ కాల్చిన ఈ ఘటనలో ఆంథోనీ ఫ్రెండ్ రైలీ గుడ్రిచ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడిన ఆంథోనీని ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. కానీ ఫలితం లేకపోవడంతో వైద్యులు లైఫ్ సపోర్టు తొలగించారు. దీంతో అతను సోమవారం తుదిశ్వాస విడిచినట్టు కాలిఫోర్నియా అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా అతని కుటుంబానికి, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇది అనాలోచిత చర్యగా ప్రకటించారు. ఈ ఘటనలో నిందితుడు జోసెఫ్ జిమెనెజ్ (20)ను అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. రైలీ గుడ్రిచ్ (ఫైల్ ఫోటో) చెరగని చిరునవ్వు, దయగల హృదయం ఆంథోనీ సొంతం.తన గురించి తెలిసిన వారందరికీ అతడొక గిప్ట్..ఆయనలేని లోటు తీరనిది అంటూ ఆంథోనీ కుటుంబం నివాళులర్పించింది. అటు ఆంథోనీ అకాల మరణంపై స్నేహితులు తీవ్ర విచారం చేశారు. ఫస్ట్ డేట్లోనే ప్రాణాలు కోల్పోయిన ఆంథోనీ, రైలీని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు ఆంథోనీ బరాజాస్ అవయవాలను దానం చేయన్నారని అతని స్నేహితుడు మాలిక్ ఎర్నెస్ట్ ట్విట్ర్లో తెలిపారు. కాగా ఆంథోనికి టిక్‌టాక్‌లో దాదాపు 10 లక్షల మంది, ఇన్‌స్టాలో 50 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. హైస్కూల్ స్థాయిలో అద్భుతమైన సాకర్ ప్లేయర్‌గా పాపులర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆంథోని లైఫ్ సపోర్ట్‌లో ఉన్నప్పుడు వైద్య ఖర్చుల నిమిత్తం ‘గోఫండ్‌మీ’ ద్వారా 80వేల డాలర్లకు పైగా విరాళాలు రావడం గమనార్హం. నిందితుడు నజోసెఫ్ జిమెనెజ్(ఫైల్ ఫోటో) -
కుప్పకూలిన హెలికాప్టర్.. నలుగురు దుర్మరణం
కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలో హెలికాప్టర్ కూలిపోయిన ఘటన విషాదాన్నినింపింది. మారుమూల ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కేఎస్టీవీ స్టేషన్ డిపార్ట్మెంట్ ధ్రువీకరించింది. ది రాబిన్సన్ ఆర్66 అనే హెలికాప్టర్ ఆదివారం మధ్యాహ్నం 1.15 సమయంలో శాక్రమెంటోకు ఉత్తరాన కొలూసా కౌంటీలో ప్రాంతంలో కుప్పకూలింది. ఈ మేరకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించిన విషయాన్ని ధృవీకరించినప్పటికీ, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం నలుగురు వ్యక్తులు చనిపోయినట్టుగా తెలుస్తోందని అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డులు ప్రకటించాయి. -
భూమి ఒకరిది.. పాస్ బుక్ మరొకరిది..
భూమి నకిలీ.. భూమిని నమ్మించే పాస్ బుక్కు నకిలీ.. నగదు నకిలీ.. కాదేదీ నకిలీకి అనర్హం. మోసం చేయాలనే ఆలోచన మెదడులో మెదిలితే చాలు దేన్నైనా నకిలీ చేయొచ్చు.. ఇంకా చెప్పాలంటే నకిలీ గాళ్లదే ఈ నయా లోకం. కొన్నేళ్లుగా ఈ తరహా మోసాలకు పాల్పడుతుంది ఓ ముఠా. గత ప్రభుత్వాల హయాంలో వెబ్‌ల్యాండ్‌ను ఆన్లైన్ చేసేందుకు పూనుకున్నారు. అవకాశాన్ని క్యాష్ చేసుకోవడమే పనిగా ఉన్న కొందరు పొలమే లేకుండా ఓ పాస్ బుక్‌ను క్రియేట్ చేసి దాంతో బ్యాంక్‌లను మోసం చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. ఈ కుంభకోణం అప్పట్లో ఓ పెద్ద చర్చనీయాంశమైంది. ఇంత జరిగినా ఇంకా ఇలాంటివి కొనసాగుతూనే ఉన్నాయంటూ మోసపోయిన బాధితులు భోరున విలపిస్తున్నారు. తాజాగా కురిచేడు మండలంలో జరిగిన ఇంకొన్ని సంఘటనలతో ‘సాక్షి’ కథనం. కురిచేడు: రైతులను ఎన్నో ఏళ్ల నుంచి వేధిస్తున్న సమస్య భూ రిజిస్ట్రేషన్లు.. నకిలీ పత్రాలు. గత టీడీపీ ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్‌లో పేర్ల నమోదు, పాస్ పుస్తకాల జారీలో అధికారులు ఇష్టానురీతిగా వ్యవహరించడంతో రైతులు ఇరకాట్లలో పడ్డారు. రైతులకు ఇష్టం వచ్చిన సర్వే నంబర్లతో పాస్ పుస్తకాలు జారీ చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో నకిలీ పట్టాలు తయారు చేయడానికి ఓ ముఠా, బ్యాంకులో ఆ పత్రాలు పెట్టించి రుణాలు ఇప్పించడానికి ఇంకో ముఠా మధ్యవర్తుల అవతారాలెత్తి రైతుల ఖాతాల్లో రుణాలు మాయం చేసిన సంఘటనలు కురిచేడు ఆంధ్రాబ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల్లో గతంలో వెలుగు చూశాయి. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఈ ముఠాల గుట్టు రట్టు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే దీన్ని అలుసుగా తీసుకుని ఇప్పటికీ అలాంటి ముఠాలు నకిలీలు సృష్టిస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. ఇవిగో ఇవే ఇప్పటి సాక్షాలు ►కురిచేడు మండలం కాటంవారిపల్లెకు చెందిన సంగు సుబ్బారెడ్డి తన సాగుభూమిని ఆన్లైన్ చేసి పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలని వీఆర్వోను ఆశ్రయించాడు. సుమారు రూ. లక్ష తీసుకుని సుబ్బారెడ్డి భూమికి బదులు వేరొకరి భూమిని పుస్తకంలో నమో దు చేయించి ఇచ్చారని సుబ్బారెడ్డి తెలిపారు. సుబ్బా రెడ్డి ఆ భూమిని వేరే వారికి విక్రయించాడు. తీరా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు తమ పేరుపై పట్టాదారు పాస్ పుస్తకానికి దరఖాస్తు చేసుకోగా.. రెవెన్యూ అధికారులు ఆ భూమిని పరిశీలించగా ఆ భూమి మరొకరి సాగులో ఉంది. కొనుగోలు చేసిన వారు సుబ్బారెడ్డిపై కేసు పెడతామని తమ డబ్బు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన సుబ్బారెడ్డి డబ్బు వెనక్కు ఇచ్చాడు. ►పడమర గంగవరం గ్రామంలో అన్నెం రామిరెడ్డి అదే గ్రామానికి చెందిన అన్నెం పెదపాపిరెడ్డి వద్ద గ్రామ కంఠం సర్వే నంబర్ 331లోని ఎం0–3.1/2 సెంట్లు ఇంటి స్థలం, మట్టిమిద్దెను 1999లో కొనుగోలు చేసి స్వాధీన అగ్రిమెంట్ చేసుకున్నాడు. అదే స్థలానికి ఓ వీఆర్వో ఇచ్చిన నకిలీ ధ్రువీకరణ పత్రం ఆధారంగా 2019లో పెదపాపిరెడ్డి భార్య రామలక్ష్మమ్మ, పడమర గంగవరం గ్రామానికి చెందిన చినపాపిరెడ్డి కుమారుడు వెంకటరెడ్డికి 2019లో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. ఆ వీఆర్వో ఇచ్చిన సర్టిఫికెట్ నకిలీదని, ఆ గ్రామానికి ఆయన వీఆర్వో కాదని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించడంతో కొనుగోలు చేసిన వారు పోలీస్ స్టేషన్, రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా ఫలితం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి నకిలీల ఆట కట్టించాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ కార్యాలయంలో గంగవరం వీఆర్వో పై ఇచ్చిన ఎండార్స్మెంట్, పడమర గంగవరం అన్నెం వెంకటరెడ్డికి ఇచ్చిన నకిలీ ధ్రువీకరణ పత్రం లక్ష రూపాయిలిచ్చి నకిలీవి తీసుకున్నా పొలానికి పట్టాదారు పాస్ పుస్తకం కావాలని వీఆర్వోని అడిగితే డబ్బులు కావాలన్నాడు. ఆయన అడిగినంత ఇచ్చాను. నాకు నకిలీ పుస్తకాలు ఇచ్చి మోసం చేశాడని ఆ పొలాన్ని మళ్లీ అమ్మితేకానీ తెలియలేదు. నాలాగా నష్టపోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఆయనపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేసి నా పొలానికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలి. – సంగు సుబ్బారెడ్డి, రైతు, కాటంవారిపల్లె ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం మండలంలో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు, పట్టాలు, సర్టిఫికెట్ల విషయం బయటకు వస్తుంది. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాను. ఉన్నతాధికారులు ఎలాంటి ఆదేశాలు ఇస్తే ఆ మేరకు నడుచుకుంటాం. – అద్దంకి శ్రీనివాసరావు, తహసీల్దార్, కురిచేడు -
చిన్న వయసులో చితికిపోతున్నయువత
పిల్లలు ఉదయాన్నే చక్కగా తయారై... భుజాన బ్యాగ్ వేసుకుని... మక్కువతో కొనిచ్చిన స్కూటీపై రయ్...రయ్... మంటూ కాలేజ్‌కు దూసుకుపోతున్న పిల్లల్ని చూస్తే ఏ తల్లిదండ్రికైనా సంబరమే. కానీ వారి ప్రవర్తనలో వస్తున్న మార్పులు గమనించకపోతే... ఆ ఆనందం ఎంతో కాలం నిలవదు. వారు నిజంగా కళాశాలకే వెళ్తున్నారా... అక్కడ వీరు ఎలాంటి పిల్లలతో స్నేహం చేస్తున్నారు... ఎన్నిగంటలకు ఇంటికి చేరుతున్నారు... ఎక్కడెక్కడకు తిరుగుతున్నారు... చదువులో ఏమేరకు రాణిస్తున్నారు... ఇలాంటివి తెలుసుకోలేకపోతే ఇక గర్భశోకం తప్పదు. యుక్తవయసులో పిల్లలు సాధారణంగా చెడు సహవాసాలతో తప్పటడుగులు వేసే ప్రమాదం ఉంది. వాటిజోలికి పోకుండా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. సాక్షి, విజయనగరం ఫోర్ట్: అభం శుభం తెలియని వయసులో ఒకరి చేతిలో మోసపోయి తల్లులవుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. చక్కగా చదువుకో వాల్సిన వయస్సులో ప్రేమ మోజులో పడి మోసపోతున్నారు. కొంతమంది ఆకర్షణకు లోనవుతుండగా...మరికొందరు చెడు సహ వాసాలతో మోసపోతున్నారు. యుక్తవయసు లో సాధారణంగా తలెత్తే సమస్యలు... ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... ప్రేమ, ఆకర్షణ వంటివాటివల్ల కలిగే స మస్యలేమిటో తెలియజేస్తున్నారు. అయినా అ మ్మాయిలు నిత్యం మోసపోతూనే ఉన్నారు. 15, 16 ఏళ్ల అమ్మాయిలే అధికం పదోతరగతి... ఇంటర్మీడియేట్... చదువుతున్నవారు అంటే 15, 16 సంవత్సరాల వయ సు కలిగినవారే ఎక్కువగా ప్రేమ, ఆకర్షణకు గురవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్ వంటి వాటి ప్రభావం వల్ల ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. స్మార్ట్ ప్రభావం కూడ అమ్మాయిలు, అబ్బాయిలపై ప్రభావం చూపుతుంది. పాఠశాలలకు, కళాశాలలకు స్మార్ట్ ఫోన్లు పట్టుకుని వెళ్తున్నారు. గంటల తరబడి చాటింగ్‌లు చేసుకుంటున్నారు. పెళ్లికాకుండానే తల్లులై... 16, 17 ఏళ్లకే ప్రేమ, ఆకర్షణ పేరుతో చిన్న వయస్సులో శారీరకంగా కలిసిపోతున్నారు. దీనివల్ల పెళ్లికాకుండానే గర్భం దాల్చుతున్నారు. పిల్లలకు జన్మనిస్తున్నారు. కొందరు ముందు జాగ్రత్తగా పిల్లల్ని కనవలసి వస్తోందని భ్రూణహత్యలకు పాల్పడుతుండగా... ఇంకొందరు పుట్టిన బిడ్డను చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. తల్లిదండ్రులను ధిక్కరించి... కొందరు అమ్మాయిలు ఆకర్షణకులోనై తల్లిదండ్రులను ధిక్కరిస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. ప్రేమించిన వాడితో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయి సహజీవనం చేస్తున్నారు. ఇలాంటి కేసులు ఇటీవల ఎక్కువ సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. చదువుకున్న అమ్మాయిలే ఎక్కువగా చేయడం గమనార్హం. వంచన... ఇంటినుంచి వెళ్లిపోవడం వంటివి గడచిన 11 నెలల్లో వందవరకూ నమోదయినట్టు పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వీరంతా మైనర్లే కావడం విశేషం. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి తల్లిదండ్రులు నిఘా పెంచితే క్షణికావేశంలో ప్రాణాలు తీసేసుకుంటున్నారు. దీనికి భయపడి తల్లిదండ్రులు మిన్నకుండి పోతున్నారు. ⇔ గజపతినగరం మండలానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ ఆమెను ప్రేమ పేరుతో లోబరచుకున్నాడు. ఫలితంగా బాలిక గర్భవతి అయింది. మూడు రోజుల క్రితం మగ బిడ్డకు జన్మనిచ్చింది. ⇔ విజయనగరం పట్టణంలోని ఓ బాలిక 9వ తరగతి వరకు చదివి మానేసింది. అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలుడు ఆమెను గర్భవతిని చేశాడు. వీరికి రెండు రోజుల క్రితం పాప పుట్టి చనిపోయింది. పిల్లల ప్రవర్తనను గమనిస్తుండాలి పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారు ఇంట్లో, బయట ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకుం టూండాలి. మంచివారితో స్నేహం చేసేలా చూడాలి. స్మార్ట్ ఫోన్లకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడం మంచింది, చెడు అలవాట్లకు బానిస కాకుండా చూడాలి. – పి.సాయి విజయలక్ష్మి, ఆడ్మినిస్ట్రేటర్, వన్‌స్టాప్ సెంటర్(సఖి) అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఆకర్షణ, ప్రేమ వంటి వాటిపై కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది 181 అవగాహన సదస్సులు నిర్వహించాం. సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎక్కువ మంది ప్రేమ, ఆకర్షణకు లోనవుతున్నారు. మంచి, చెడుల గురించి తల్లిదండ్రులు వారి పిల్లలకు తెలియజేయాలి. – కె.రమాదేవి, కౌన్సిలర్, వన్‌స్టాప్ సెంటర్ -
నిఖా పేరుతో భర్త చేతిలో మోసపోయిన మహిళ
-
ఇన్‌స్పెక్టర్‌నే మోసం చేశాడు
రాజంపేట టౌన్: బ్యాంకు ఖాతా నెంబర్లు, ఏటీఎం నెంబర్లు ఎవరికీ చెప్పవద్దని ఇటు పోలీసు, అటు బ్యాంకు అధికారులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అలాగే ఈ విషయాలపై పత్రికల్లోను, టీవీల్లోనూ తరచూ కథనాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలు మాత్రం ఘరానా మోసగాళ్ల మాయలో పడుతూనే ఉన్నారు. తాజాగా రాజంపేట పట్టణం ఎస్వీ నగర్‌కు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాచవరం బ్రహ్మయ్యఆచారి ఓ మోసగాడి మాటలు నమ్మి తన ఎస్బీఐ ఖాతాలోని 6,778 రూపాయిల నగదును పోగొట్టుకున్నాడు. తనకు జరిగిన మోసాన్ని బ్రహ్మయ్య ఆచారి ఇక్కడి విలేకరుల ఎదుట ఏకరవు పెట్టుకున్నాడు. బాధితుని కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈనెల 17వ తేదీ ఓ వ్యక్తి కాల్ చేసి తాను ఎస్బీఐ హెడ్ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను అంటూ హిందీలో చెప్పుకొచ్చాడు. అనంతరం హిందీలోనే మీ ఏటీఎం కార్డుకు ఆధార్ లింక్ అప్ చేయాలని తొలుత ఆధార్ నెంబర్ అడిగాడు. అనంతరం మీ ఏటీఎం కార్డు గడువు కూడా అయిపోయిందని, రెన్యువల్ చేస్తామని, కార్డు రెన్యువల్ అయిన వెంటనే మీకు మెసేజ్ వస్తుందని చెప్పాడు. దీంతో బ్రహ్మయ్య ఆచారి ముందు వెనుక ఆలోచించకుండా ఏటీఎం కార్డుపై ఉండే నెంబర్ చెప్పాడు. దీంతో ఆ మోసగాడు అదే రోజు పలు మార్లు బాధితుని ఖాతాలో ఉన్న 6,778 రూపాయిలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అయితే మోసగాడు ఏటీఎం కార్డు రెన్యువల్ అయిన వెంటనే మెసేజ్ వస్తుందని చెప్పిన విషయం బ్రహ్మయ్య ఆచారికి గుర్తుకు వచ్చి ఏటీఎంలో మినీ స్టేట్మెంట్ తీసుకున్నాడు. దీంతో తన ఖాతా నుంచి పలుమార్లు డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యి ఖాతాలోని డబ్బంతా ఖాళీ కావడంతో మోసపోయినట్లు బాధితుడు గ్రహించాడు. తెలియని వ్యక్తులు ఎవరు ఫోన్ చేసినా, ఇంటివద్దకు వచ్చి ప్రజలు ఎవరు కూడా ఆధార్, ఏటీఎం కార్డు నెంబర్లు చెప్పవద్దని పత్రికా ముఖంగా బాధితుడు కోరాడు. తెలియని వ్యక్తులకు నెంబర్లు చెపితే తనలాగే మోసపోవాల్సి వస్తుందని బాధితుడు తెలిపాడు. -
రైతాంగాన్ని మోసగిస్తున్న ప్రభుత్వం
మునగాల: రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన మండల పార్టీ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు ఎన్.ఇంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో జలదోపిడి జరుగుతుందని ఆనాడు గగ్గోలు పెట్టిన నాయకులు ప్రస్తుతం ఆంధ్రాకు సాగర్‌నీరు తరలి వెళ్తుంటే మౌనం వహించడం ఏమిటని ప్రశ్నించారు. ఖరీఫ్‌కాలం ప్రారంభమై రెండు నెలలు గడిచిన అనంతరం సాగర్ నీరు విడుదల చేస్తామని ప్రకటించడం రైతాంగాన్ని మోసగించడమేనన్నారు. సీఎం కేసీఆర్ మాటలు ఆచరణలో అమలుకు నోచుకోవడం సా«ధ్యం కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమలో ఆయనతో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రేమ పేరుతో మోసపోయిన మరో యువతి