
రైతాంగాన్ని మోసగిస్తున్న ప్రభుత్వం
మునగాల: రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన మండల పార్టీ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు ఎన్.ఇంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో జలదోపిడి జరుగుతుందని ఆనాడు గగ్గోలు పెట్టిన నాయకులు ప్రస్తుతం ఆంధ్రాకు సాగర్‌నీరు తరలి వెళ్తుంటే మౌనం వహించడం ఏమిటని ప్రశ్నించారు. ఖరీఫ్‌కాలం ప్రారంభమై రెండు నెలలు గడిచిన అనంతరం సాగర్ నీరు విడుదల చేస్తామని ప్రకటించడం రైతాంగాన్ని మోసగించడమేనన్నారు. సీఎం కేసీఆర్ మాటలు ఆచరణలో అమలుకు నోచుకోవడం సా«ధ్యం కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమలో ఆయనతో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.