ఎర్ర సముద్రంలో అమెరికాకు చెందిన నేవీ హెలికాప్టర్ ఒకటి కుప్పకూలింది.
ఎర్ర సముద్రంలో అమెరికాకు చెందిన నేవీ హెలికాప్టర్ ఒకటి కుప్పకూలింది. అందులో ఉన్న ఐదుగురు సిబ్బంది ఆచూకీ తెలియడంలేదని సిన్హువా వార్తాసంస్థ తెలిపింది. ప్రస్తుతం బహ్రైన్లో ఉన్న అమెరికా నౌకాదళంలోని ఐదో ఫ్లీట్కు చెందిన ఎంహెచ్-60ఎస్ హెలికాప్టర్ ఆపరేషన్ సందర్భంగా ఎర్ర సముద్రంలో కుప్పకూలినట్లు ఆ దళం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ హెలికాప్టర్ కింగత్వాక్ రకానికి చెందినది. అందులో ఉన్న ఐదుగురు సిబ్బంది ఆచూకీ ఇంతవరకు తెలియడంలేదని, అయితే ప్రమాదానికి కారణం మాత్రం విద్రోహచర్య కాకపోవచ్చని నౌకాదళం తన ప్రకటనలో వెల్లడించింది. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, దర్యప్తు కూడా ప్రారంభం అయ్యిందని తెలిపింది.