కూలిన హెలికాప్టర్ :13 మంది మృతి | 13 presumed dead, two missing in helicopter crash off Norway's western coast | Sakshi
Sakshi News home page

కూలిన హెలికాప్టర్ :13 మంది మృతి

Published Sat, Apr 30 2016 12:23 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

కూలిన హెలికాప్టర్ :13 మంది మృతి

కూలిన హెలికాప్టర్ :13 మంది మృతి

నార్వే సమీపంలోని పశ్చిమ తీరంలో హెలికాప్టర్ కుప్పకూలింది.

స్వీడన్ :  నార్వే సమీపంలోని పశ్చిమ తీరంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. 11 మృతదేహాలను వెలికి తీశారు. మరో రెండు మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోందని ఉన్నతాధికారులు వెల్లడించారు. నార్వేకు చెందిన సంస్థ స్టేట్ అయిల్ కంపెనీలో అయిల్ను వెలికి తీసిన కార్మికులను మెయిన్ లాండ్కు తీసుకువస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.

మృతుల్లో బ్రిటన్ దేశస్థుడు కూడా ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాదంపై బ్రిటన్ విదేశీ కార్యాలయం స్పందించింది. మృతుల్లో మరణించిన బ్రిటన్ వాసి కుటుంబానికి అన్ని విధాల తోడుగా ఉంటామని ఆ కార్యాలయ ప్రతినిధి వెల్లడించారు. అందుకు గాను స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement