
Chhattisgarh Helicopter Crash, రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో హెలికాప్టర్ కుప్పకూలింది. రాయ్‌పూర్ విమానాశ్రయంలో ప్రభుత్వ హెలికాప్టర్ గురువారం రాత్రి 9.10 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేస్తున్న సమయంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్ కుప్పకూలిన సమయంలో అందులో ఇద్దరు పైలట్లు ఉండగా.. ఇద్దరూ మృత్యువాతపడ్డారు మృతిచెందిన పైలట్లు కెప్టెన్ గోపాల్ కృష్ణ పాండా, కెప్టెన్ శ్రీ వాస్తవగా గుర్తించారు. రాయపూర్ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ రాకేష్ సహాయ్ ప్రమాద విషయాన్ని ధృవీకరించారు,
మన పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో రాత్రి ఫ్లయింగ్ ప్రాక్టీస్ సందర్భంగా ఈ సంఘటన జరిగిందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తరపున వివరణాత్మక సాంకేతిక విచారణ చేపట్టింది.
సీఎం విచారం
హెలికాప్టర్ ప్రమాద ఘటనపై చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగెల్ విచారం వ్యక్తం చేశారు. మరణించిన ఇద్దరు పైలట్లకు నివాళులు అర్పించారు. మరణించిన పైలట్ల కుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment