
ప్రధానే మా టార్గెట్.. అందుకే కూల్చేశాం!
పాకిస్థాన్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాద ఘటనపై పాకిస్థానీ తాలిబన్లు స్పందించారు. ఆ హెలికాప్టర్ను తామే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్తో కూల్చేశామని ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ను హతమార్చడమే లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు అందులో తెలిపారు. (చదవండి- హెలికాప్టర్ కూలి.. ఇద్దరు రాయబారుల మృతి)
అయితే.. నిజంగానే పాక్ తాలిబన్లు ఈ చాపర్ను కూల్చేశారా.. లేదా కూలిపోయిన తర్వాత అవకాశ వాదంతో తాము కూల్చినట్లు చెప్పుకొంటున్నారా అన్న విషయం మాత్రం అప్పుడే ఖరారు చేయలేమని పాక్ సైనిక వర్గాలు అంటున్నాయి.
మరోవైపు.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ గిలిగిత్-బాల్తిస్తాన్ ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా.. ఈ ప్రమాదం విషయం తెలిసి అక్కడ ఆగకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయినవారికి తన సంతాపం ప్రకటించారు.