nawaz shariff
-
‘పాక్ ప్రధాని ఆత్మహత్య చేసుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నా’
Pakistan Former PM Nawaz Sharif Sensational Comments On Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మరో సారి విరుచుకుపడ్డారు. ప్రస్తుతం లండన్‌లో గుండె సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతున్న షరీఫ్, గురువారం లాహోర్‌లో జరిగిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ సాధారణ సమావేశానికి ఆన్లైన్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ను ‘తోలుబొమ్మ’ అని పిలుస్తారని, అమెరికాలో ఇమ్రాన్ ఖాన్ కంటే అక్కడి మేయర్‌కే ఎక్కువ అధికారాలు ఉంటాయన్నారు. ఎందుకంటే అతను ఎలా అధికారంలోకి వచ్చాడో ప్రపంచానికి తెలుసు. ఇమ్రాన్ ప్రజల ఓట్లతో గాక సైనిక స్థాపన సహాయంతో వచ్చాడని’ షరిఫ్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ తాను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కి దగ్గరకు సహాయం కోసం వెళ్లడం కంటే ఆత్మహత్య చేసుకోవడానికే ఇష్టపడతానని చెబుతుండేవాడు. అయితే తాను మాత్రం ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడోనని వేచి చూస్తున్నట్లు షరీఫ్ సంచలన వ్యా్ఖ్యలు చేశారు. పాకిస్తాన్లో రెండు అవినీతి కేసుల్లో దోషిగా తేలిన 71 ఏళ్ల షరీఫ్, వైద్య చికిత్స కోసం నాలుగు వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు లాహోర్ హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత నవంబర్ 2019 నుంచి లండన్‌లో నివసిస్తున్నారు. 2018లో సైన్యం సహకారంతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ప్రభుత్వం మొదటి మూడు సంవత్సరాల్లో విదేశీ ప్రభుత్వాలు, సంస్థల నుంచి సుమారు 34 బిలియన్ల డాలర్లకు పైగా అప్పులు తీసుకుందని షరీఫ్ తెలిపారు. చదవండి: పెళ్లై ఇద్దరు పిల్లలు.. యువతితో ప్రేమాయణం.. గర్భం దాల్చడంతో -
జస్ట్ మిస్
-
పాక్ జడ్జి ఇంటిపై దుండగుల కాల్పులు
లాహోర్: పదవీచ్యుతుడైన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇంటిపైకి గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. లాహోర్ మోడల్‌టౌన్ ప్రాంతంలో ఉన్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఇజాజ్ ఉల్ అహ్సాన్ నివాసంపై గుర్తు తెలియని దుండగులు తెల్లవారు జామున 4.30 గంటలకు, తిరిగి ఉదయం 9 గంటల సమయంలో రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. పనామా పత్రాల కేసులో నిందితుడిగా ఉన్న ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌పై అనర్హత వేటు వేసిన సుప్రీంకోర్టు బెంచ్‌లో జస్టిస్ అహ్సాన్ కూడా ఒకరు. -
ట్రంప్ వల్ల భారత్-పాక్ సంబంధాలకు చేటు?
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయడం వల్ల భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందట. ఈ విషయాన్ని అమెరికన్ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. విదేశీ నేతలకు ఫోన్లు చేసేముందు కొన్ని దశాబ్దాలుగా ఉన్న దౌత్య సంప్రదాయాలను చెడగొట్టేలా ఉండకూడదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన కథనంలో పేర్కొంది. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. పాక్ ప్రధానికి ఫోన్ చేయడం, ఆ దేశ సమస్యల పరిష్కారానికి కావల్సిన ఏ పాత్రనైనా తాను పోషిస్తానని చెప్పడం వల్ల భారత్ - పాక్ సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఉందని చెప్పింది. చైనాతో ఉన్న సంబంధాలు కూడా దెబ్బతినేలా తైవాన్ అధ్యక్షుడు త్సాయ్ ఇంగ్ వెన్‌తో ట్రంప్ మాట్లాడటంతో చైనా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 1979 తర్వాత.. అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి లేదా అధ్యక్షుడు తైవాన్ నాయకులతో మాట్లాడటం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అద్భుతమైన మనుషులతో కూడిన అద్భుతమైన దేశానికి తాను తప్పకుండా వస్తానని నవాజ్ షరీఫ్‌తో ట్రంప్ అన్నట్లు కథనాలు వచ్చాయి. పాకిస్థానీలు ప్రపంచంలోనే తెలివైన ప్రజల్లో ఒకరని కూడా ట్రంప్ అన్నట్లు తెలిసింది. అసలే పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని మండిపడుతున్న భారత దేశానికి ట్రంప్ చర్యలు పుండు మీద కారం చల్లినట్లుంటాయని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. -
'ప్రధానే మా టార్గెట్...'
-
ప్రధానే మా టార్గెట్.. అందుకే కూల్చేశాం!
పాకిస్థాన్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాద ఘటనపై పాకిస్థానీ తాలిబన్లు స్పందించారు. ఆ హెలికాప్టర్‌ను తామే యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్‌తో కూల్చేశామని ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను హతమార్చడమే లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు అందులో తెలిపారు. (చదవండి- హెలికాప్టర్ కూలి.. ఇద్దరు రాయబారుల మృతి) అయితే.. నిజంగానే పాక్ తాలిబన్లు ఈ చాపర్‌ను కూల్చేశారా.. లేదా కూలిపోయిన తర్వాత అవకాశ వాదంతో తాము కూల్చినట్లు చెప్పుకొంటున్నారా అన్న విషయం మాత్రం అప్పుడే ఖరారు చేయలేమని పాక్ సైనిక వర్గాలు అంటున్నాయి. మరోవైపు.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ గిలిగిత్-బాల్తిస్తాన్ ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా.. ఈ ప్రమాదం విషయం తెలిసి అక్కడ ఆగకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయినవారికి తన సంతాపం ప్రకటించారు. -
పాక్ ప్రధానిపై హత్యకేసు నమోదు
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సహా పలువురు మంత్రులపై అక్కడి పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్న నిరసనకారులను చంపినందుకు ఈ కేసు నమోదైనట్లు న్యాయవాదులు తెలిపారు. ప్రధానమంత్రి సహా మరో 11 మంది ఉన్నతాధికారులు, హోం మంత్రి, రైల్వే మంత్రి, నగర కమిషనర్, పోలీసు చీఫ్ తదితరులపై హత్య కేసు నమోదు చేయాల్సిందిగా స్థానిక కోర్టు ఒకటి పోలీసులను ఆదేశించింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరిగిన ప్రదర్శనల సందర్భంగా తమ కార్యకర్తలు ఇద్దరు మరణించారని, దీనిపై కేసు నమోదు చేయాలని కోరుతూ పాకిస్థాన్ అవామీ తెహరీక్ (పీఏటీ) నాయకుడు తహిరుల్ ఖాద్రీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవానికి ఆ సందర్భంగా జరిగిన గొడవల్లో దాదాపు 500 మందికి పైగా మరణించారు. వారిలో కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు. -
ప్రధాని నవాజ్ షరీఫ్ గద్దె దిగాల్సిందే!
-
దేశ ప్రధానులైనా.. తల్లికి కొడుకులే..