Pakistan Former PM Nawaz Sharif Sensational Comments On Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మరో సారి విరుచుకుపడ్డారు. ప్రస్తుతం లండన్‌లో గుండె సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతున్న షరీఫ్, గురువారం లాహోర్‌లో జరిగిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ సాధారణ సమావేశానికి ఆన్‌లైన్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ను ‘తోలుబొమ్మ’ అని పిలుస్తారని, అమెరికాలో ఇమ్రాన్ ఖాన్ కంటే అక్కడి మేయర్‌కే ఎక్కువ అధికారాలు ఉంటాయన్నారు.
ఎందుకంటే అతను ఎలా అధికారంలోకి వచ్చాడో ప్రపంచానికి తెలుసు. ఇమ్రాన్ ప్రజల ఓట్లతో గాక సైనిక స్థాపన సహాయంతో వచ్చాడని’ షరిఫ్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ తాను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కి దగ్గరకు సహాయం కోసం వెళ్లడం కంటే ఆత్మహత్య చేసుకోవడానికే ఇష్టపడతానని చెబుతుండేవాడు. అయితే తాను మాత్రం ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడోనని వేచి చూస్తున్నట్లు షరీఫ్ సంచలన వ్యా్‌ఖ్యలు చేశారు.
పాకిస్తాన్‌లో రెండు అవినీతి కేసుల్లో దోషిగా తేలిన 71 ఏళ్ల షరీఫ్, వైద్య చికిత్స కోసం నాలుగు వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు లాహోర్ హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత నవంబర్ 2019 నుంచి లండన్‌లో నివసిస్తున్నారు. 2018లో సైన్యం సహకారంతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ప్రభుత్వం మొదటి మూడు సంవత్సరాల్లో విదేశీ ప్రభుత్వాలు, సంస్థల నుంచి సుమారు 34 బిలియన్ల డాలర్లకు పైగా అప్పులు తీసుకుందని షరీఫ్ తెలిపారు.
చదవండి: పెళ్లై ఇద్దరు పిల్లలు.. యువతితో ప్రేమాయణం.. గర్భం దాల్చడంతో
Comments
Please login to add a commentAdd a comment