puppet
-
‘పాక్ ప్రధాని ఆత్మహత్య చేసుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నా’
Pakistan Former PM Nawaz Sharif Sensational Comments On Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మరో సారి విరుచుకుపడ్డారు. ప్రస్తుతం లండన్‌లో గుండె సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతున్న షరీఫ్, గురువారం లాహోర్‌లో జరిగిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ సాధారణ సమావేశానికి ఆన్లైన్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ను ‘తోలుబొమ్మ’ అని పిలుస్తారని, అమెరికాలో ఇమ్రాన్ ఖాన్ కంటే అక్కడి మేయర్‌కే ఎక్కువ అధికారాలు ఉంటాయన్నారు. ఎందుకంటే అతను ఎలా అధికారంలోకి వచ్చాడో ప్రపంచానికి తెలుసు. ఇమ్రాన్ ప్రజల ఓట్లతో గాక సైనిక స్థాపన సహాయంతో వచ్చాడని’ షరిఫ్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ తాను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కి దగ్గరకు సహాయం కోసం వెళ్లడం కంటే ఆత్మహత్య చేసుకోవడానికే ఇష్టపడతానని చెబుతుండేవాడు. అయితే తాను మాత్రం ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడోనని వేచి చూస్తున్నట్లు షరీఫ్ సంచలన వ్యా్ఖ్యలు చేశారు. పాకిస్తాన్లో రెండు అవినీతి కేసుల్లో దోషిగా తేలిన 71 ఏళ్ల షరీఫ్, వైద్య చికిత్స కోసం నాలుగు వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు లాహోర్ హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత నవంబర్ 2019 నుంచి లండన్‌లో నివసిస్తున్నారు. 2018లో సైన్యం సహకారంతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ప్రభుత్వం మొదటి మూడు సంవత్సరాల్లో విదేశీ ప్రభుత్వాలు, సంస్థల నుంచి సుమారు 34 బిలియన్ల డాలర్లకు పైగా అప్పులు తీసుకుందని షరీఫ్ తెలిపారు. చదవండి: పెళ్లై ఇద్దరు పిల్లలు.. యువతితో ప్రేమాయణం.. గర్భం దాల్చడంతో -
గవర్నర్ కీలుబొమ్మా?
పట్నా: బిహార్‌లో ఆదివారం సివిల్ సర్వీసెస్ పరీక్షలు జరిగాయి. జనరల్ నాలెడ్జ్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులు ప్రశ్నపత్రంలోని ఒక ప్రశ్నను చూసి ఆశ్చర్యపోయారు. ‘ఇండియాలో, ప్రత్యేకించి బిహార్ రాజకీయాల్లో గవర్నర్ పాత్రను విశ్లేషించండి. గవర్నర్ కీలుబొమ్మా(కఠ్పుత్లీ)?’అన్నది ఆ ప్రశ్న. గవర్నర్ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అంటూ విపక్షాలు విమర్శించడం జరిగేదే. అయితే, ఏకంగా ప్రభుత్వ పరీక్షలో, అందులోనూ సివిల్ సర్వీసెస్ పరీక్షలో రావడంతో విద్యార్థులు విస్తుపోయారు. బిహార్ సర్వీస్ కమిషన్ అధికారులు ఈ తప్పును ప్రశ్నపత్రాన్ని రూపొందించిన అధ్యాపకుడిపైకి నెట్టేశారు. ‘ప్రశ్నలో తప్పేమీ లేదు.అయితే, కఠ్పుత్లీ పదాన్ని తీసేసి ఉంటే బాగుండేది’అని నసిగారు. గతంలో 8వతరగతి పరీక్షలో కశ్మీర్‌ను ఓ దేశంగా పేర్కొంటూ.. ‘చైనా, ఇండియా, నేపాల్, ఇంగ్లాండ్, కశ్మీర్ దేశాల ప్రజలను ఏమని పిలుస్తారు?’ అన్న ప్రశ్న వచ్చింది. 2016లో ఇంటర్మీడియెట్‌లో ర్యాంకు సాధించిన రూబీరాయ్ పొలిటికల్ సైన్స్‌లో ‘వంట చేయడం’ ఉంటుందని చెప్పి షాక్ ఇచ్చింది. 2015లో పరీక్షరాసే విద్యార్థులకు కాపీలు అందించడం కోసం వారి బంధువులు పరీక్ష గది గోడలు ఎక్కడం తెల్సిందే. -
గవర్నర్ చేతిలో సీఎం కీలుబొమ్మ
ఈటానగర్: గవర్నర్ జేపీ రాజ్ ఖోవా చేతిలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కలిఖో పల్ కీలుబొమ్మ అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. కాంగ్రెస్ పక్షనేత నబాం టుకీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అధికార పార్టీ అరుణాచల్ పీపుల్స్ పార్టీకి గవర్నర్ బంగ్లా రాజ్ భవన్ కేంద్ర కార్యాలయంగా మారిందని ఆరోపించారు. కేంద్రం ఆశీస్సులతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను గవర్నర్ రాజ్ ఖోవా చక్కగా నిర్వర్తిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బమాంగ్ ఫెలిక్స్ ఎద్దేవా చేశారు. గవర్నర్ చేప్పిన విషయాలకు మాత్రమే సీఎం స్పందిస్తున్నారని, ఆయన సాధించింది ఏం లేదన్నారు. అసత్య ప్రచారం, వాస్తవరూపం దాల్చలేని హామీలిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలను నిర్వహించడంలో కూడా పీపీఏ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆర్థిక సమస్యలను తెచ్చిపెడుతూ వాటికి ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను బాధ్యులను చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యంపై త్వరలోనే గవర్నర్ వద్దకు వెళ్లి పిర్యాదు చేయనున్నట్లు పార్టీ అధిష్టానం నిర్ణయించిందని తెలిపారు.