విమానం కూలి పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడ్డాయి. ఆ విమానం బూడిద అయ్యి చివరి తోక భాగం మాత్రమే కనిపిస్తుంది. వైమానికి చిత్రాల్లో నేలపై కనిపిస్తున్న దృశ్యం చాలా భయానకంగా ఉంది. కానీ ఆ ఇద్దరు పైలట్లు సురక్షితంగా ప్రాణాలతో బయటపడటం అందర్నీ షాక్‌కి గురి చేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో పెర్త్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే...ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఆగ్నేయంగా 420 కి.మీ దూరంలో ఫిట్జ్‌గెరాల్డ్ నేషనల్ పార్క్‌లో బోయింగ్ 737 వాటర్ బాంబింగ్ విమానం ఒక్కసారిగా కూలిపోయింది. అది కూలడంతో భూమికి సమాంతరంగా.. బలంగా తాకడంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మొత్తం అక్కడ ఉన్న పచ్చని చెట్లు బూడిదయ్యి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ ఘటనలో విమానం పూర్తిగా ధ్వంసమై వెనుకభాగం మాత్రమే కనిపిస్తోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే తీసిన ఎమర్జెన్సీ సర్వీసెస్ చిత్రాలు విమానం తోకభాగం వేరు చేయబడి ఉన్నట్లు కనిపించింది.
ఈ ప్రమాదం బారి నుంచి విమానంలోని ఇద్దరు పెలెట్లు సురక్షితంగా బయటపడటం మిరాకిల్ అని ఆస్ట్రేలియా అత్యవసర సేవల మంత్రి స్టీఫెన్ డాసన్ అన్నారు. వాస్తవానికి అది ఎయిర్ ట్యాంకర్‌గా మార్చబడిన ప్రయాణికుల విమానం అని చెప్పారు. అయితే ఆయా ప్రాంతాల్లో నీటిని సరఫరా చేసేశాకే ఆ విమానం కూలినట్లు వెల్లడించారు. వీటిని అగ్నిమాపక విమానాలుగా వ్యవహరిస్తారన్నారు.
ఈ మేరకు ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే అధికారుల సంఘటనస్థలి నుంచి ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పీట్ రికార్డర్‌ని స్వాధీనం చేసుకోన్నట్లు చెప్పారు. గత ఐదేళ్లో 64 అగ్నిమాపక విమాన ప్రమాదాలు జరిగాయని, ఆయా సంఘటనల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాల గురించి భద్రతా విభాగం పరిశీలిస్తోందన్నారు. ఇలింటి అనహ్య ఘటనల్లో సిబ్బందిని సురక్షితంగా రక్షించడంపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భద్రతా అధికారులు దృష్టి సారించనున్నట్లు మంత్రి స్టీఫెన్ పేర్కొన్నారు.
(చదవండి: ముగ్గురు అమ్మాయిలను పెళ్లాడిన వ్యక్తి!)
Comments
Please login to add a commentAdd a comment