
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని బుద్గాంలో బుధవారం మిగ్ యుద్ధ విమానం కుప్పకూలింది. యుద్ద విమానం కుప్పకూలడంతో ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారని అధికారులు వెల్లడించారు. రొటీన్ సైనిక విన్యాసాల్లో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుందా, యుద్ధ సన్నాహక చర్యల్లో భాగంగా ఈ ప్రమాదం జరిగిందా అనే దానిపై స్పష్టత లేదు.
మిగ్ యుద్ధ విమానం కూలిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విమానం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment