MiG 27 fighter jet
-
మిగ్–27కు వీడ్కోలు
జోథ్‌పూర్: దాదాపు మూడు దశాబ్దాల పాటు సేవలందించిన మిగ్(ఎంఐజీ)–27 యుద్ధ విమానాలు ఇక విశ్రాంతి తీసుకోనున్నాయి. జోథ్‌పూర్ వైమానిక స్థావరంలో శుక్రవారం జరిగిన మిగ్ వీడ్కోలు కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఎస్కే ఘోటియా పాల్గొన్నారు. ఈ విమానాలు పోరాటక్షేత్రంలో ముందు నిలిచాయని, 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో అమూల్యమైన సేవలందించాయని తెలిపారు. ఇన్నాళ్లూ జోథ్‌పూర్ ఎయిర్ బేస్‌లో మిగ్–27 రకం విమానాలు ఏడు వరకు సేవలందించాయి. -
కుప్పకూలిన మిగ్ యుద్ధ విమానం
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని బుద్గాంలో బుధవారం మిగ్ యుద్ధ విమానం కుప్పకూలింది. యుద్ద విమానం కుప్పకూలడంతో ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారని అధికారులు వెల్లడించారు. రొటీన్ సైనిక విన్యాసాల్లో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుందా, యుద్ధ సన్నాహక చర్యల్లో భాగంగా ఈ ప్రమాదం జరిగిందా అనే దానిపై స్పష్టత లేదు. మిగ్ యుద్ధ విమానం కూలిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విమానం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. -
కూలిన యుద్ధ విమానం: ఇద్దరు పౌరులు మృతి
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్‌లోని అలీపూద్వార్ సమీపంలో ఎంఐజీ 27 యుద్ధ విమానం శుక్రవారం రాత్రి కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పౌరులు మరణించారు. అయితే విమాన పైలట్ మాత్రం క్షేమంగా ఉన్నాడని భారత వాయుసేనకు చెందిన ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. హషిమారా బేస్ క్యాంప్‌లో దిగవలసిన ఈ యుద్ధ విమానం కొన్ని నిమిషాల ముందు కూలిందని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.