‘ఏప్రిల్‌ 1 నుంచి ఆ విమానాలు బంద్‌’ | Jet Airways Pilots Threaten To Stop Flying If Salaries Not Paid | Sakshi
Sakshi News home page

‘ఏప్రిల్‌ 1 నుంచి ఆ విమానాలు బంద్‌’

Published Tue, Mar 19 2019 8:26 PM | Last Updated on Tue, Mar 19 2019 8:26 PM

Jet Airways Pilots Threaten To Stop Flying If Salaries Not Paid - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో సవాల్‌ ముంచుకొచ్చింది. ఈ మాసాంతంలోగా జీతాలు చెల్లించకుంటే విమానాలు పైకి ఎగరవని, తమ సేవలు నిలిపివేస్తామని పైలట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ యాజమాన్యాన్ని హెచ్చరించారు. కంపెనీ దేశీయ పైలట్లతో కూడిన నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌లో మంగళవారం విస్తృతంగా చర్చించిన అనంతరం వారు ఈ ప్రకటన చేశారు.

సంస్థను చక్కదిద్దే ప్రణాళికపై స్పష్టత రాకున్నా, వేతన చెల్లింపులపై పరిష్కారం లభించకపోయినా ఏప్రిల్‌ 1 నుంచి తాము విధులకు హాజరుకాబోమని గిల్డ్‌ స్పష్టం చేసింది. వేతనాలపై యాజమాన్యం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఏవియేటర్స్‌ గిల్డ్‌ గతవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వర్‌కు లేఖ రాసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement