ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో మహిళల ప్రాతినిధ్యంపై మరో చారిత్రక ఘట్టమిది. యుద్ధ హెలికాప్టర్ పైలట్లుగా శిక్షణ ఇవ్వడానికి ఇద్దరు మహిళా అధికారుల్ని ఆర్మీ ఎంపిక చేసింది. మహిళల్ని యుద్ధ విమానాలకు పైలట్లుగా నియమించాలన్న ప్రతిపాదనలకు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె ఆమోదముద్ర వేసిన ఆరు నెలల్లోనే మహిళా పైలెట్ల ఎంపిక జరిగింది. వైమానిక విభాగంలో యుద్ధ హెలికాప్టర్లను నడపడంలో శిక్షణ ఇవ్వడానికి ఇద్దరు మహిళల్ని ఎంపిక చేసినట్టుగా ఆర్మీ అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్రలోని నాసిక్‌లో కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూలులో వారిద్దరికీ శిక్షణ ఇవ్వనున్నట్టుగా చెప్పారు. 15 మంది మహిళా అధికారులు ఏవియేషన్ విభాగంలో చేరడానికి ముందుకు వస్తే కఠినమైన పరీక్షల అనంతరం ఇద్దరు మాత్రమే ఇందుకు అర్హత సంపాదించారని ఆ అధికారులు వివరించారు. శిక్షణ విజయవంతంగా పూర్తయితే వచ్చే ఏడాది జూలై నుంచి వారికి యుద్ధ విమానాల్ని నడిపే అవకాశం వస్తుంది. 2018లో ఫ్లయింగ్ ఆఫీసర్ అవని చతుర్వేది యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.
చదవండి:
వైరల్: చావు నుంచి తప్పించుకున్న మహిళలు
గాలి కోసం 10 వేల మొక్కలు నాటాడు.. చివరికి గాలి అందక కన్నుమూశాడు
Comments
Please login to add a commentAdd a comment