combat helicopter
-
రూ.62,500 కోట్లతో 156 ప్రచండ్ హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: రూ.62,500 కోట్లతో 156 ప్రచండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ(సీసీఎస్) శుక్రవారం ఆమోద ముద్రవేసింది. ఈ తేలికపాటి కాంబాట్ హెలికాప్టర్లను హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) నుంచి కొనుగోలు చేయనున్నారు. దేశంలో సైనిక సామర్థ్యాన్ని పెంచడంలో ఇదొక ముందడుగు అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేసి, అభివృద్ధి చేసిన యుద్ధ హెలికాప్టర్లు ఇవే కావడం విశేషం. ప్రచండ్ హెలికాప్టర్లు 5 వేల మీటర్ల ఎత్తు వరకు ప్రయాణింగలవు. సీసీఎస్ ఆమోదం తెలపడంతో హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన రెండు ఒప్పందాలపై రక్షణ శాఖ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇందులో 66 హెలికాప్టర్లను భారత వాయుసేనకు, మరో 90 హెలికాప్టర్లను భారత నావికాదళానికి హెచ్ఏఎల్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ‘మేక్ ఇన్ ఇండియా’కు ఇదొక గొప్ప ప్రోత్సాహకమని, ఈ రెండు ఒప్పందాల వల్ల 8,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. -
స్వదేశీ ఆయుధ సంపత్తి
విజయదశమి.. ఆయుధపూజ వేళ... భారత వాయుసేన (ఐఏఎఫ్) అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ (ఎల్సీ హెచ్) ‘ప్రచండ’ చేరికతో మన సైన్యానికి కొత్త జవసత్వాలు సమకూరాయి. జోద్పూర్ వైమానిక కేంద్రం వేదికగా సోమవారం సైనిక ఉన్నతాధికారులతో కలసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలివిడతగా నాలుగు హెలికాప్టర్లను లాంఛనంగా వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. పలు విధాలుగా ఇది కీలక ఘట్టం. పొరుగున చైనా నుంచి పొంచివున్న ముప్పు నేపథ్యంలో ప్రధానంగా ఎల్తైన పర్వత ప్రాంతాల్లో సైతం శత్రువులపై పోరాడే దేశవాళీ ఛాపర్ ఇప్పుడు మన చేతిలో ఉన్నట్టయింది. ప్రభుత్వ రంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్ – హాల్) తయారు చేసిన ఈ లోహవిహంగం గణనీయంగా ఆయుధాలు, ఇంధనం తీసుకొని 5 వేల మీటర్ల ఎత్తున కూడా కిందకు దిగగలదు. టేకాఫ్ తీసుకోగలదు. ప్రపంచంలో అలాంటి యుద్ధ హెలికాప్టర్ ఇదొక్కటే అని నిపుణుల మాట. అతి వేడిగా ఉండే ఎడారుల్లో, రక్తం గడ్డ కట్టించే అతి ఎల్తైన ప్రాంతాల్లో, విద్రోహ చర్యల్ని విచ్ఛిన్నం చేసే వేళల్లో – ఇలా అన్ని యుద్ధ సందర్భాల్లో గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించ గలగడం ఈ లోహ విహంగాల ప్రత్యేకత. వెరసి, సైనిక ఆయుధాలను విదేశాల నుంచి కొనడానికే పేరుబడ్డ భారత్ ఈ దేశీయ తయారీ యుద్ధ హెలికాప్టర్లతో కనీసం ఇంతవరకైనా బయ్యర్ నుంచి బిల్డర్‌గా మారింది. ‘మేకిన్ ఇండియా’ స్వప్నసాకారంలో ఒక అడుగు ముందుకు పడింది. 1999 నాటి కార్గిల్ యుద్ధవేళ దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ అవసరం తొలిసారిగా మనకర్థమైంది. అప్పటికి మన దగ్గర చేతక్, చీతా లాంటి హెలికాప్టర్లే ఉన్నాయి. కానీ మరింత చురుగ్గా, బహు పాత్రపోషణ చేయగలవి అవసరమయ్యాయి. ఆ పరిస్థితుల్లో తొలి దశ చర్చల తర్వాత 2006 అక్టోబర్‌లో ప్రభుత్వం ఎల్సీహెచ్ ప్రాజెక్ట్‌ను ‘హాల్’కు మంజూరు చేసి, వాటిని అభివృద్ధి చేసే బాధ్యతను అప్పగించింది. అలా పైలట్, కోపైలట్లు ఒకరి వెనుక మరొకరు కూర్చొనేలా ఈ రెండు ఇంజన్ల, 5.8 టన్నుల లోహ విహంగాన్ని డిజైన్ చేశారు. అనేక కఠిన పరీక్షల అనంతరమే ఈ ఛాపర్లకు అనుమతినిచ్చి, సైన్యంలోకి తీసుకున్నారు. అందుకు 2010– 2015 మధ్య 4 నమూనా ఛాపర్లు సిద్ధం చేసి, రకరకాల ఎత్తుల్లో, 2 వేలకు పైగా గగనయాన పరీక్షలు చేశారు. 2017లో వైమానిక దళ నమూనాకూ, 2019లో ఆర్మీ నమూనాకూ తొలిదశ అనుమతి వచ్చింది. నిరుడు నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రతీకాత్మకంగా ఎల్సీహెచ్ను భారత వైమానిక దళానికి అప్పగించి, ఆఖరి ఘట్టానికి తెర తీశారు. ఈ మార్చిలో భద్రతా వ్యవహారాల మంత్రివర్గ సంఘం వాయుసేనకు 10, ఆర్మీకి 5 – మొత్తం 15 ఎల్‌సీహెచ్‌ల తయారీకి ఆమోదం తెలిపింది. దరిమిలా సెప్టెంబర్ 29న బెంగళూరులో ఆర్మీలోకీ, ఇప్పుడు జోద్‌పూర్‌లో వాయుసేనలోకీ ఎల్‌సీహెచ్‌లను లాంఛనంగా ప్రవేశపెట్టారు. ఇలాంటి ఎల్‌సీహెచ్‌లు 160 దాకా మనకు అవసరం. గంటకు 268 కి.మీ గరిష్ఠ వేగంతో వెళ్ళగల ఈ ‘ప్రచండ’ ఛాపర్లలో అనేక ప్రత్యేకతలున్నాయి. 6.5 కి.మీ ఎత్తున ఎగరగల సత్తా ఈ లోహ విహంగం సొంతం. 20 ఎంఎం టరెట్ గన్, 70 ఎంఎం రాకెట్లు, గగనతల క్షిపణి వ్యవస్థలతో ఇది యుద్ధసన్నద్ధమై ఉంటుంది. శత్రు రాడార్ల గురి నుంచి రక్షణవ్యవస్థ ఉండే ఈ ఛాపర్ ముష్కరుల గగనతల భద్రతావలయాన్ని ఛేదించి, విద్రోహ చర్యలను తిప్పికొడుతుంది. తొలి దేశీయ యుద్ధ విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ జలప్రవేశం చేసి నెల తిరిగేసరికి ఇప్పుడు ఈ యుద్ధ హెలికాప్టర్లు మన వైమానికదళానికి సమకూరడం సంతోషమిచ్చే పరిణామం. వీటికన్నా ముందే ఈ జూన్‌లో తీరప్రాంత గస్తీ దళంలోకి దేశవాళీ అడ్వాన్స్›్డ లైట్ హెలికాప్టర్ ఎంకె–3 వచ్చి చేరింది. భారత రక్షణ రంగానికి ఇవన్నీ శుభసూచనలు. రక్షణ రంగంలో ఒకపక్క దిగుమతులు తగ్గించుకొంటూనే, మరోపక్క అంతర్జాతీయ వేదికపై తన ఉనికిని చాటుకుంటున్న ట్టయింది. గత అయిదేళ్ళలో మన రక్షణ ఎగుమతులు 334 శాతం పెరిగాయని సర్కారు వారి మాట. ప్రస్తుతం 75కి పైగా దేశాలకు మన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. మన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌పై మలేసియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, అమెరికా, ఇండొనేసియా, ఫిలిప్పైన్స్ సైతం ఆసక్తి కనబరచడం విశేషం. రక్షణ ఉత్పత్తుల దేశవాళీ డిజైనింగ్, అభివృద్ధి, తయారీకై కొన్నేళ్ళుగా తీసుకుంటున్న విధాన నిర్ణయాలు క్రమంగా ఫలితమిస్తున్నట్టున్నాయి. విదేశాల నుంచి రక్షణ ఉత్పత్తుల్ని మనం దిగుమతి చేసుకోవడం 2012–16తో పోలిస్తే, 2017–21లో దాదాపు 21 శాతం తగ్గాయని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెబుతోంది. అయితే, ఇప్పటికీ ఆయుధాల దిగుమతిలో ప్రపంచంలో మనం ముందు వరుసలోనే మిగిలాం. రష్యన్ తయారీ ఆయుధాలపై భారీగా ఆధార పడ్డాం. ఈ పరిస్థితి మారాలంటే, తక్కువ వ్యయంతోనే ప్రపంచ ప్రమాణాలను అందుకొనే సాంకేతి కతను అభివృద్ధి చేయాలి. అదే అతి పెద్ద సవాలు. చిక్కులు లేకుండా ప్రభుత్వం అవసరమైన వనరుల్ని అందించి, పరిశోధన – అభివృద్ధిని ప్రోత్సహిస్తే, కీలక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించి ఆ సవాలును అధిగమించవచ్చు. రక్షణ రంగంలో దిగుమతులు తగ్గించుకొని, సొంత కాళ్ళ మీద నిలబడవచ్చు. దృఢసంకల్పం ఉంటే అది అసాధ్యమేమీ కాదని ‘ప్రచండ్’ రూపకల్పన చెబుతోంది. సాధించిన ఘనతతో పాటు సాధించాల్సిన లక్ష్యాలను మరోసారి గుర్తుచేస్తోంది. -
శత్రువుల పాలిట ‘ప్రచండ’మే
సాక్షి, న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అధునాతన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్(ఎల్సీహెచ్) ప్రచండ్ భారత వైమానిక దళంలో చేరింది. సోమవారం రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ వైమానికస్థావరంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సమక్షంలో 4 లైట్ కంబాట్ హెలికాప్టర్లను వైమానిక దళంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రచండ్లో రాజ్‌నాథ్ కొద్దిసేపు ప్రయాణించారు. పర్వతప్రాంతాల్లో, ఎడారి వంటి ప్రతికూల వాతావరణంలో పగలూ, రాత్రి శత్రువులపై దాడి చేయగలగడం ప్రచండ్ ప్రత్యేకత. గగనతలంలోని లక్ష్యాలను గగనతలం నుంచే చేధించగల క్షిపణులను, ట్యాంక్ విధ్వంసక మిస్సైళ్లను, 20 ఎంఎం తుపాకులనూ వీటిలో అమర్చవచ్చు. నిమిషానికి 750 తూటాలను పేల్చగల సత్తా వీటి సొంతం. పర్వతప్రాంతాల్లోని శత్రు సైన్యంపై, ట్యాంక్‌లు, బంకర్లు, డ్రోన్లపై ఇవి సులభంగా దాడిచేయగలవని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. 22 ఏళ్ల క్రితం భారత్ కన్న కల ఇప్పుడు నెరవేరిందని రాజ్‌నాథ్ అన్నారు. 1999లో పాకిస్తాన్‌తో కార్గిల్ యుద్ధకాలంలో పర్వతప్రాంతాల్లో తేలికపాటి పోరాట హెలికాప్టర్ల ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి చేసిన పరిశోధన ఫలితమే ప్రచండ్ రూపంలో వచ్చిందన్నారు. ఇంకొన్ని ప్రత్యేకతలు ఈ హెలికాప్టర్లు గరిష్ట సంఖ్యలో ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని మోసుకెళ్లగలవు. గాలిలో ఎక్కువసేపు ఉండటానికి సరిపడా ఇంథనాన్ని నింపొచ్చు. ఎడారుల్లో, మంచుమయమైన హిమాలయ పర్వతాల్లోనూ పోరాడగలవు. ట్విన్ ఇంజన్లు ఉన్న ఈ హెలికాప్టర్ బరువు 5.8 టన్నులు. శత్రువుకు కనపడని రంగులో, తక్కువ శబ్దం చేస్తూ, రాడార్‌కు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లకు చిక్కకుండా వెళ్లగలవు. హెలికాప్లర్లను అడవులు, పట్టణ ప్రాంతాలలో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలోనూ మొహరించవచ్చు. ఇక సైనిక వెర్షన్లో 96 హెలికాప్టర్లను తీసుకోవాలని ఆర్మీ భావిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Prachand: రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది
జైపూర్: భారత సైన్యం రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. వైమానిక దళంలోకి మేడ్ ఇన్ ఇండియా ఘనత వచ్చి చేరింది. తేలికపాటి యుద్ద హెలికాఫ్టర్(LCH) ‘ప్రచండ్’ను ఇవాళ(సోమవారం) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి ప్రవేశపెట్టారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. దేశీవాళీ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్ ‘ప్రచండ్’ను జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రవేశపెట్టారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సర్వ్ ధరమ్ ప్రార్థన సైతం నిర్వహించారు. Made-in-India light combat helicopters 'Prachand' inducted into IAF Read @ANI Story | https://t.co/S6zR9sWphB#LCH #Prakhand #RajnathSingh #IAF pic.twitter.com/nh36KANOdz — ANI Digital (@ani_digital) October 3, 2022 చాలా కాలంగా.. దాడుల కోసం తేలికపాటి హెలికాప్టర్ల అవసరం ఉంది. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో ఆ అవసరాన్ని తీవ్రంగా భావించింది మన సైన్యం. LCH అనేది రెండు దశాబ్దాల పరిశోధన-అభివృద్ధి ఫలితం. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి ప్రచండ్ ప్రవేశం రక్షణ ఉత్పత్తిలో ఒక కీలకమైన మైలురాయి. ప్రచండ్ సమర్థవంతంగా శత్రు నిఘా నుంచి తప్పించుకోగలదు. వివిధ రకాల మందుగుండు సామగ్రిని మోసుకెళ్ళగలదు. దానిని త్వరగా యుద్ధ ప్రాంతాలకు అందించగలదు. ఇది వివిధ భూభాగాలలో మన సాయుధ దళాల అవసరాలను సంపూర్ణంగా తీరుస్తుంది. ఇది మన సైన్యం, వైమానిక దళం రెండింటికీ ఆదర్శవంతమైన వేదిక అని ఈ సందర్భంగా పేర్కొన్నారు మంత్రి రాజ్‌నాథ్ సింగ్. For a long time, there was a need for attack helicopters & during the 1999 Kargil war, its need was felt seriously. The LCH is a result of research & development for two decades. And its induction into IAF is an important milestone in defence production: Defence Minister R Singh pic.twitter.com/zU5KrCUjwk — ANI (@ANI) October 3, 2022 ప్రచండ్ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) రూపొందించింది. 5,000 మీటర్ల (16,400 అడుగులు) ఎత్తులో గణనీయంగా ఆయుధాలు, ఇంధనంతో.. భారత సాయుధ దళాల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ప్రచండ్ ల్యాండ్-టేకాఫ్ చేసుకోగలదు. ప్రపంచంలోనే ఈ తరహా దాడులు చేయగలిగిన ఏకైక హెలికాప్టర్ ఇదే కావడం గమనార్హం. There is no need to define ‘Prachand’, the LCH itself is capable of sending out a message to the enemy: Defence Minister Rajnath Singh after his LCH sortie at Jodhpur IAF airbase pic.twitter.com/KQoRtRjvfH — ANI (@ANI) October 3, 2022 అవసరమైన చురుకుదనం, యుక్తి, విస్తరించిన శ్రేణి, అధిక ఎత్తులో పనితీరు, అన్ని వేళలా.. వాతావరణం ఎలాంటిదైనా సరే పోరాట సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ప్రచండ్. భారత సైన్యం.. ప్రత్యేకించి వైమానిక దళం కార్యాచరణ అవసరాలను తీర్చడానికి ప్రచండ్ ఒక శక్తివంతమైన వేదిక అవుతుందని అధికారులు చెప్తున్నారు. మార్చిలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ (CCS) రూ. 3,887 కోట్లతో దేశీయంగా అభివృద్ధి చేసిన 15 పరిమిత శ్రేణి ఉత్పత్తి (LSP) తేలికపాటి యుద్ధ విమానాల సేకరణకు ఆమోదం తెలిపింది. IAF కోసం పది హెలికాప్టర్లు, భారత సైన్యం కోసం ఐదు హెలికాప్టర్లు ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: 8% గృహాలకు వారంలో ఒక్క రోజే నీరు -
భారత త్రివిధ దళాల్లో మరో చారిత్రక ఘట్టం
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో మహిళల ప్రాతినిధ్యంపై మరో చారిత్రక ఘట్టమిది. యుద్ధ హెలికాప్టర్ పైలట్లుగా శిక్షణ ఇవ్వడానికి ఇద్దరు మహిళా అధికారుల్ని ఆర్మీ ఎంపిక చేసింది. మహిళల్ని యుద్ధ విమానాలకు పైలట్లుగా నియమించాలన్న ప్రతిపాదనలకు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె ఆమోదముద్ర వేసిన ఆరు నెలల్లోనే మహిళా పైలెట్ల ఎంపిక జరిగింది. వైమానిక విభాగంలో యుద్ధ హెలికాప్టర్లను నడపడంలో శిక్షణ ఇవ్వడానికి ఇద్దరు మహిళల్ని ఎంపిక చేసినట్టుగా ఆర్మీ అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూలులో వారిద్దరికీ శిక్షణ ఇవ్వనున్నట్టుగా చెప్పారు. 15 మంది మహిళా అధికారులు ఏవియేషన్ విభాగంలో చేరడానికి ముందుకు వస్తే కఠినమైన పరీక్షల అనంతరం ఇద్దరు మాత్రమే ఇందుకు అర్హత సంపాదించారని ఆ అధికారులు వివరించారు. శిక్షణ విజయవంతంగా పూర్తయితే వచ్చే ఏడాది జూలై నుంచి వారికి యుద్ధ విమానాల్ని నడిపే అవకాశం వస్తుంది. 2018లో ఫ్లయింగ్ ఆఫీసర్ అవని చతుర్వేది యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. చదవండి: వైరల్: చావు నుంచి తప్పించుకున్న మహిళలు గాలి కోసం 10 వేల మొక్కలు నాటాడు.. చివరికి గాలి అందక కన్నుమూశాడు -
దీని సామర్థ్యం.. ఫెంటాస్టిక్..
ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని విమానంలా ఉంది కదూ.. అయితే ఇది విమానం కాదు.. యుద్ధ హెలికాప్టర్. పేరు ఏవీఎక్స్ జేఎంఆర్. టెక్సాస్‌కు చెందిన ఏవీఎక్స్ సంస్థ దీని డిజైన్‌ను రూపొందించింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. అమెరికా తదుపరి తరం యుద్ధ హెలికాప్టర్ అయ్యే చాన్స్ దీనికే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా సైన్యంలో సేవలందిస్తున్న బ్లాక్ హాక్ హెలికాప్టర్ల్లను మార్చాలని భావిస్తున్న పెంటగాన్.. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించింది. రూ.6 లక్షల కోట్ల విలువైన ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకోవడానికి ఓ నాలుగైదు సంస్థలు పోటీపడుతుండగా.. ఏవీఎక్స్ అందులో ముందంజలో ఉంది. ఈ ఎటాక్ హెలికాప్టర్‌కు రెండు రోటర్లు ఉంటాయి. మొత్తం 16 మంది ప్రయాణించే వీలున్న ఈ హెలికాప్టర్ అత్యధిక వేగం గంటకు 434 కిలోమీటర్లు. బరువు 12 వేల కిలోలు. 5,900 కిలోల బరువును సునాయాసంగా మోయగలదు. ఇక శత్రువులపై దాడి చేయడానికి కావాల్సిన అన్ని ఆయుధాలు, ఏర్పాట్లు ఇందులో దండిగా ఉన్నాయి.