ముంబై: వచ్చే 20 ఏళ్లలో భారత్‌లో 31,000 మంది పైలట్లు అలాగే 26,000 మంది మెకానిక్‌లు అవసరం కావచ్చని విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తే తెలిపారు. దేశీ ఎయిర్‌లైన్స్ భారీ స్థాయిలో విమానాలకు ఆర్డర్లు ఇవ్వడం ఇందుకు దోహదపడనుందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు!
టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిరిండియా గత నెల బోయింగ్, ఎయిర్‌బస్‌లకు 470 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. అంతర్జాతీయంగా చూస్తే రాబోయే 20 ఏళ్లలో దక్షిణాసియా ప్రాంతంలో విమానయాన రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందనుందని గుప్తే వివరించారు. భారత్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతున్నందున మౌలిక సదుపాయాలు.. అలాగే పైలట్లు తదితర వనరులను సమకూర్చు కోవడంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్
కరోనా మహమ్మారి తర్వాత విమాన ప్రయాణాలకు డిమాండ్ ఆశ్చర్యపర్చే విధంగా రికవరీ అయ్యిందని గుప్తే తెలిపారు. ఎయిర్ ట్రావెల్ వృద్ధిపై ఆర్థిక సంక్షోభ ప్రభావాలేమీ పడే అవకాశాలు కనిపించడం లేదన్నారు. బోయింగ్‌కి ఉన్న ఆర్డర్లపరంగా చూస్తే భారత్‌లో చిన్న విమానాలకు డిమాండ్ నెలకొందని గుప్తే చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు 90 శాతం మార్కెట్ వీటిదే ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: గేమింగ్ హబ్‌గా భారత్.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన
Comments
Please login to add a commentAdd a comment