
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలో 100 పాయింట్లుకు పైగా ఎగిసిన మార్కెట్లకు అనంతరం అమ్మకాల సెగ భారీగా తాకింది. ఆరంభ లాభలనుంచి వెనక్కి మళ్లిన సూచీలు ఎక్కడా కోలుకున్న దాఖలు కనిపించలేదు. దీంతో సెన్సెక్స్ ఏకంగా 530 మేర క్షీణించి 38370స్థాయిని నమోదు చేసింది. నిఫ్టీ 169 పాయింట్లు పతనమైన 11427స్థాయికి చేరింది. ఆరంభంలో 11660కి పైన స్థిరంగా ఉన్న నిఫ్టీ చివరికి 11500 స్థాయిని కోల్పోవడం గమనార్హం. బ్యాంక్ నిఫ్టీ 600పాయింట్లు కోల్పోయింది.
అన్ని రంగాల్లోనూ అమ్మకాల జోరు కొనసాగుతోంది. ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్, ఫార్మా, రియల్టీ, టెలికాం రంగాల్లో సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తోంది. ఆటో కౌంటర్లలో ఎంఅండ్‌ఎం, అశోక్ లేలాండ్, టీవీఎస్, హీరో మోటో, బజాజ్ ఆటో, మారుతీ, టాటా మోటార్స్, ఐషర్, రియల్టీ కౌంటర్లలో ఒబెరాయ్, సన్‌టెక్, ప్రెస్టేజ్, ఫీనిక్స్, మహీంద్రా లైఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్‌ఎఫ్, శోభా డెవలపర్స్ నష్టపోతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, గెయిల్, బజాజ్ ఫిన్, ఇన్‌ఫ్రాటెల్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. ఆర్‌బీఎల్ ఫలితాలు, యాజమాన్య వ్యాఖ్యల నేపథ్యంలో భారీగా (9శాతం) నష్ట పోతోంది. అలాగే మార్కెట్ ముగిసిన అనతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ1 ఫలితాలను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఆర్‌ఐఎల్ కూడా బలహీనంగా ట్రేడ్ అవుతోంది. టైటన్, అల్ట్రాటెక్, ఎన్‌టీపీసీ, టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్, వేదాంతా, పవర్‌గ్రిడ్ స్వల్పంగా లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment