ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ (ఫైల్)
సాక్షి, ముంబయి: ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా మురుద్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. అయితే హెలికాప్టర్‌లోని వారంతా క్షేమంగా ఉన్నారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో నలుగురు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో ముగ్గురు సురక్షితంగా బయట పడ్డారని, ఓ మహిళకు మాత్రం గాయాలైనట్లు తెలిపారు. హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా ప్రమాదం జరినట్లు తెలుస్తోంది. అది గాల్లో ఉన్నప్పుడే సాంకేతిక లోపం ప్రమాదం సంబవించినట్లు సమాచారం. సంఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment