
బెంగళూర్ : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా జోదిచిక్కెనహళ్లి వద్ద పంట పొలాల్లో మంగళవారం ఉదయం డీఆర్‌డీఓ డ్రోన్ కుప్పకూలింది. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో డ్రోన్ కూలిందని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఘటనా స్ధలానికి డీఆర్‌డీఓ అధికారులు చేరుకుంటున్నారు. చిత్రదుర్గ జిల్లా కేంద్రానికి సమీపంలో డీఆర్‌డీఓ చల్లకెరె ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఏటీఆర్)ను ఏర్పాటు చేస్తోంది. కూలిన డ్రోన్ డీఆర్‌డీఓకు చెందిన రుస్తోం-2 డ్రోన్ అని చిత్రదుర్గ ఎస్పీ తెలిపారు. ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో విఫలమవడంతో డ్రోన్ వ్యవసాయ క్షేత్రంలో కూలిందని, డ్రోన్ కూలడంతో పెద్దసంఖ్యలో ప్రజలు గుమికూడగా, వారిని అక్కడి నుంచి పంపి తాము ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment