బెంగళూరు: రక్షణ శాఖ(డీఆర్‌డీఓ)కు చెందిన డ్రోన్ కుప్పకూలింది. కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో పంట పొలాల్లో ఈ మానవ రహిత డ్రోన్ కూలిపోయింది. ప్రమాద ఘటనకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాద ప్రదేశానికి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు గుమిగూడారు.
#WATCH | A Tapas drone being developed by the DRDO crashed today during a trial flight in a village of Chitradurga district, Karnataka. DRDO is briefing the Defence Ministry about the mishap and an inquiry is being carried out into the specific reasons behind the crash: Defence… pic.twitter.com/5YSfJHPxTw
— ANI (@ANI) August 20, 2023
డీఆర్‌డీఓ మానవ రహిత డ్రోన్‌లపై పరిశోధనలో భాగంగా.. ఆదివారం తాపస్ అనే డ్రోన్‌ను ట్రయల్ రన్ చేశారు. ఈ క్రమంలో అది కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. దీనిపై రక్షణ శాఖ దర్యాప్తు చేపడుతోంది. ప్రమాద స్థలంలో డ్రోన్ ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదీ చదవండి: చంద్రయాన్-3: చంద్రుడికి అడుగు దూరంలో ఇస్రో ‘విక్రమ్’.. ఇక చివరి ఘట్టం అదే
Comments
Please login to add a commentAdd a comment