
సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా వద్దికేరె గ్రామం సమీపంలో తపస్07 ఎ–14 రకం డ్రోన్ కుప్పకూలింది. చిత్రదుర్గం వద్ద డీఆర్‌డీఓ ఏరోనాటికల్ టెస్టింగ్ రేంజ్ (ఏటీఆర్) ఉంది. నిత్యం ఇక్కడ డ్రోన్లు, మానవ రహిత విమానాల పరీక్షలు జరుగుతుంటాయి.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఈ డ్రోన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తుండగా చెళ్లకెర తాలూకా హిరియూరు వద్ద పొలంలో పెద్ద శబ్ధంతో కుప్పకూలింది. దాని భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. డీఆర్‌డీవో అధికారులు, పోలీసులు ధ్వంసమైన డ్రోన్‌ను అక్కడి నుంచి తరలించారు. సాంకేతిక లోపంతోనే అది కూలిందని, విచారణ జరుపుతున్నామని డీఆర్‌డీవో అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment