
కుప్పకూలిన హెలికాప్టర్: సైనిక అధికారులు మృతి
కోలకత్తా: పశ్చిమ బెంగాల్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సైనిక హెలికాప్టర్ కూలిపోవడంతో ముగ్గురు సైనిక అధికారులు అక్కడికక్కడే మరణించారు. మరో జూనియర్ కమిషన్డ్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం 10.30 గంటల ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ సుక్నా లో అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అధికారులు పైలట్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.