నల్లగొండ: వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొన్న ప్రమాదం నల్లగొండ జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
పెన్‌పహాడ్ మండలం అనంతరాం క్రాస్‌రోడ్డు వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. సూర్యాపేట నుంచి మిర్యాలగూడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న లాల్‌సాబ్(45), మన్సూర్‌బీ(40)కి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను 108 సాయంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.