స్టేజీపై డ్యాన్స్‌ చేస్తుండగానే... | Man Collapses Dies On Stage While He Was Dancing On DDLJ Song | Sakshi
Sakshi News home page

స్టేజీపై డ్యాన్స్‌ చేస్తుండగానే...

Published Tue, Mar 6 2018 1:18 PM | Last Updated on Tue, Mar 6 2018 1:28 PM

Man Collapses Dies On Stage While He Was Dancing On DDLJ Song - Sakshi

బార్మర్‌ : జీవితం.. నిజంగా ఎంత అనూహ్యమైనది. ఏ క్షణాన మృత్యువు కాటేస్తుందో చెప్పడం చాలా కష్టంగా మారుతోంది. రాజస్తాన్‌లో జరిగిన ఈ సంఘటన మాత్రం హృదయాల్ని కలచివేస్తోంది. ఒక వ్యక్తి ఎంతో సంతోషంగా స్టేజీపై నవ్వుతూ డ్యాన్స్‌ చేస్తుండగానే.. అతన్ని మృత్యువు కాటేసింది. డ్యాన్స్‌ చేస్తూనే స్టేజీపై కుప్పకూలిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

రాజస్తాన్‌లో బార్మర్‌లో ఓ యంగ్‌ కపుల్‌, దిల్ వాలే దుల్హనియా లేజాయింగేలో 'తుజే దేకా తో హే జానా సనం'' అనే పాటకు ఓ ఫంక్షన్‌లో డ్యాన్స్‌ చేస్తూ ఉన్నారు. అలా నర్తిస్తుండగానే.. ఆమె జోడి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ సంఘటనను కూడా డ్యాన్స్‌లో భాగంగానే చూశారు ఆ అమ్మాయి, ఇతర ప్రేక్షకులు. కొద్దిసేపటి తర్వాత అతన్ని ఆ అమ్మాయి లేపడం ప్రయత్నించింది. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. అతను ప్రాణాలు కోల్పోయినట్టు తెలియగానే ఒక్కసారిగా అక్కడున్న వారందరూ హతాశులయ్యారు. అతనికి కార్డియాక్‌ అరెస్ట్‌ రావడం వల్ల చనిపోయాడని ప్రాథమిక రిపోర్టులు చెబుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement