ddlj
-
సిమ్రాన్ ట్రైన్‌ని అందుకుని 26 ఏళ్లు
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, అందాల తార కాజోల్ జంటగా నటించిన చిత్రం ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాకి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మూవీతో ఈ ఇద్దరు కూడా స్టార్స్‌గా మారిపోయారు. అయితే ఈ రోజుతో ఈ సినిమా విడుదలై 26 ఏళ్లు పూర్తి అయ్యాయి. దీంతో ఈ సినిమా గురించి ఓ వీడియోని షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది ఇందులో ‘సిమ్రాన్’గా నటించిన కాజోల్. ఆ సినిమాలో క్లైమాక్స్‌లో ట్రైన్లో వెళుతున్న షారుక్ చేతిని అందుకునే సీన్ గుర్తుండే ఉంటుంది. ఈ సీన్‌ని షేర్ చేసింది ఈ బ్యూటీ. దానికి.. ‘సిమ్రాన్ ట్రైన్‌ని అందుకుని 26 ఏళ్లు. ఇంకా మాపై ప్రేమ చూపిస్తున్నందుకు థ్యాంక్స్’ అంటూ క్యాప్షన్‌ని జోడించింది. అయితే ఈ మూవీని షాట్‌గా ‘డీడీఎల్జే’ అంటు ఉంటారు ఫ్యాన్స్. కాగా ఇప్పటికి ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చిన చూసేందుకు అభిమానులు సిద్ధంగా ఉంటారు. చదవండి: హీరోయిన్ని డైరెక్ట్ చేయనున్న నటి View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
ఐకానిక్ సీన్ : ‘చైన్ లాగితే అయిపోయేది కదా..’
ఇక్కడేమో సిమ్రన్ తండ్రి ఆమె చేతిని పట్టుకుని నిల్చున్నాడు.. అటు చూస్తే సిమ్రన్ తన జీవితంలోకి రాలేదనే బాధతో రాజ్ బేలగా చూస్తుంటాడు. పాపం సిమ్రన్ ఇటు తండ్రిని కాదనలేక.. అటు దూరమవుతున్న ప్రియున్ని దక్కించుకోలేక అసహాయంగా చూస్తుంటోంది. ఇంతలో రైలు కదులుతుంది. అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో సిమ్రన్ తండ్రి కూతురుని చూస్తు ‘వెళ్లు సిమ్రన్ నువ్వు కోరుకున్న ప్రపంచంలోకి’ అంటూ కూతురి చేయిని వదిలేస్తాడు. అంతే దూరమవుతున్న ప్రియున్ని చేరుకోవడం కోసం సిమ్రన్ కదులుతున్న రైలుతో పాటే తాను పరిగెడుతుంది. రాజ్, సిమ్రన్ చేతిని అందుకుని రైలులోకి ఎక్కిస్తాడు. దాంతో కథ సుఖాంతం అవుతుంది. ఈ సన్నివేశం 23 ఏళ్ల క్రితం హిందీ సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాసిన ఓ హిట్ చిత్రంలోనిది. ఇంతకు ఆ సినిమా ఏదో గుర్తుకొచ్చిందా.. అదే ‘దిల్ వాలే దుల్హానియే లే జాయేంగే’. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సిమ్రన్‌గా ‘కాజోల్’, ‘రాజ్’గా షారుక్ ఖాన్ జీవించారు. నాటి నుంచి కాజోల్ అబ్బాయిల ‘డ్రీమ్‌గర్ల్’గా, కింగ్ ఖాన్ షారుక్ అయితే ‘రొమాన్స్ కింగ్’గా నిలిచిపోయారు. ఈ చిత్రం విడుదలై నేటికి రెండు దశాబ్దాలు కావొస్తోన్నా ఇప్పటికీ ఈ సినిమాకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. అయితే ఈ క్రెడిట్ అంతా దర్శకుడు ఆదిత్య చోప్రాకే దక్కుతుందంటున్నారు ‘సిమ్రన్’ కాజోల్. ఈ మధ్యే ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా కాజల్ ‘దిల్వాలే దుల్హానియే లే జాయేంగే’ చిత్రం షూటింగ్ విశేషాలను గుర్తుచేసుకున్నారు. కాజోల్ మాటల్లో.. ‘డీడీఎల్జే చిత్రంలో నేను పరిగెత్తుతూ రైలులోకి ఎక్కే ఆ సీన్ ఒక ఐకానిక్ సీన్‌గా నిలిచిపోయింది. ఈ సీన్ ఇప్పటికే చాలా సినిమాల్లో వాడారు కూడా. అంత క్రేజ్ వచ్చిన ఈ సీన్ షూట్ చేయడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సీన్ తీసే సమయంలో వాతావరణం చాలా వేడిగా ఉండటంతో చిరాకు వచ్చేది. నా జుట్టు గాలికి ఎగురుతూ వీర విహారం చేసేది. దానికి తోడు ఆ రైలు మేము అనుకున్న స్పీడ్‌లో కాకుండా మరింత వేగంగా వెళ్లేది. రీ షూట్ చేయాలంటే మళ్లీ ఆ రైలు వచ్చే వరకూ అంటే దాదాపు 20 నిమిషాల పాటు ఎదురు చూడాల్సిందే. ఆ సమయంలో రాజ్ నన్ను అలా పరిగెత్తించే బదులు చైన్ లాగి రైలు ఆపితే అయిపోయేది కదా అనిపించేది’ అంటూ కాజల్ చెప్పుకొచ్చారు. అంతేకాక ‘ఇంత శ్రమకోర్చి తీసిన ఈ సన్నివేశం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రిలోనే ఒక మైలురాయిగా నిలిచి పోయింది. కానీ ఇందులో నా గొప్పతనం ఏం లేదు. ఈ క్రెడిటంతా ఆదిదే’(దర్శకుడు ఆదిత్య చోప్రా) అంటూ కాజోల్ వివరించారు. -
స్టేజీపై డ్యాన్స్ చేస్తుండగానే...
బార్మర్ : జీవితం.. నిజంగా ఎంత అనూహ్యమైనది. ఏ క్షణాన మృత్యువు కాటేస్తుందో చెప్పడం చాలా కష్టంగా మారుతోంది. రాజస్తాన్‌లో జరిగిన ఈ సంఘటన మాత్రం హృదయాల్ని కలచివేస్తోంది. ఒక వ్యక్తి ఎంతో సంతోషంగా స్టేజీపై నవ్వుతూ డ్యాన్స్ చేస్తుండగానే.. అతన్ని మృత్యువు కాటేసింది. డ్యాన్స్ చేస్తూనే స్టేజీపై కుప్పకూలిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్తాన్‌లో బార్మర్‌లో ఓ యంగ్ కపుల్, దిల్ వాలే దుల్హనియా లేజాయింగేలో 'తుజే దేకా తో హే జానా సనం'' అనే పాటకు ఓ ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అలా నర్తిస్తుండగానే.. ఆమె జోడి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ సంఘటనను కూడా డ్యాన్స్‌లో భాగంగానే చూశారు ఆ అమ్మాయి, ఇతర ప్రేక్షకులు. కొద్దిసేపటి తర్వాత అతన్ని ఆ అమ్మాయి లేపడం ప్రయత్నించింది. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. అతను ప్రాణాలు కోల్పోయినట్టు తెలియగానే ఒక్కసారిగా అక్కడున్న వారందరూ హతాశులయ్యారు. అతనికి కార్డియాక్ అరెస్ట్ రావడం వల్ల చనిపోయాడని ప్రాథమిక రిపోర్టులు చెబుతున్నాయి. -
స్టేజీపై డ్యాన్స్ చేస్తుండగానే...
-
వర్మ-మ్యాగీ ఒక ప్రేమకథ!
క్రియెటివ్ డైరెక్టర్, కాంట్రవర్సీ కింగ్.. ఇలా ఎన్నైనా చెప్పండి. రాంగోపాల్ వర్మ రాంగోపాల్ వర్మనే. ఆయన ఎప్పుడూ వార్తల్లో వ్యక్తే. తాజాగా ఒక ప్రేమకథతో ఆయన ట్విట్టర్‌కు ఎక్కారు. అది మ్యాగీ న్యూడిల్స్‌పై ఆయనకున్న ప్రేమ. ఇటీవల నిషేధానికి గురై అనేక కష్టనష్టాలు పడ్డ నెస్లే మ్యాగీ న్యూడిల్స్‌కు వర్మ అడుగడుగునా బాసటగా నిలిచారు. అందుకు రుణం తీర్చుకోవాలి కదా! అందుకే మ్యాగీ కూడా ఆయన ప్రేమను, మద్దతును స్వీకరించింది. ఇందుకు ప్రతిగా ఆయనకు ఓ గిఫ్ట్ హ్యాంపర్‌ను పంపిస్తామని తెలిపింది. చిరునామా వివరాలు ఇవ్వమని కోరింది. దీంతో వర్మ పొంగిపోయారు. దీనిని గౌరవంగా భావించారు. మ్యాగీ బేబి నువ్వు ఇప్పటికీ 20 లక్షల నిమిషాల ఆనందాన్ని కానుకగా ఇచ్చావు. హుమ్మా' అంటూ ఓ ముద్దుపెట్టారు. ఇలా ట్విట్టర్లో నడిచిన మ్యాగీ- వర్మ ప్రేమకథను చూసి ఓ అభిమాని స్పందించాడు. షారుఖ్‌ఖాన్, కాజోల్ జంటగా నటించిన 'దిల్వాలే దుల్హానియా లేజాయెంగే' సినిమా కంటే మధురమైన, అతి సుందరమైన ప్రేమకథ మీదేనంటు కితాబిచ్చాడు. అది కూడా నచ్చేయడంతో వర్మ దానిని రీట్వీట్ చేశారు. Honoured and Maggied -
ఆగని ప్రేమ ప్రవాహం
-
1000 వారాల డిడిఎల్జె