26 Years Of Dilwale Dulhania Le Jayenge Movie - Sakshi
Sakshi News home page

‘డీడీఎల్‌జే’ విడుదలై 26 ఏళ్లు.. థ్యాంక్స్‌ చెప్పిన కాజోల్‌

Published Thu, Oct 21 2021 1:00 PM | Last Updated on Thu, Oct 21 2021 1:13 PM

Kajol Shares a Video on 26 Years Of Dilwale Dulhania Le Jayenge - Sakshi

బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌, అందాల తార కాజోల్‌ జంటగా నటించిన చిత్రం ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ ఎంత పెద్ద హిట్‌ సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాకి దేశవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఈ మూవీతో ఈ ఇద్దరు కూడా స్టార్స్‌గా మారిపోయారు. అయితే ఈ రోజుతో ఈ సినిమా విడుదలై 26 ఏళ్లు పూర్తి అయ్యాయి. దీంతో ఈ సినిమా గురించి ఓ వీడియోని షేర్‌ చేసి తన ఆనందాన్ని పంచుకుంది ఇందులో ‘సిమ్రాన్‌’గా నటించిన కాజోల్‌.

ఆ సినిమాలో క్లైమాక్స్‌లో ట్రైన్‌లో వెళుతున్న షారుక్‌ చేతిని అందుకునే సీన్‌ గుర్తుండే ఉంటుంది. ఈ సీన్‌ని షేర్‌ చేసింది ఈ బ్యూటీ. దానికి.. ‘సిమ్రాన్‌ ట్రైన్‌ని అందుకుని 26 ఏళ్లు. ఇంకా మాపై ప్రేమ చూపిస్తున్నందుకు థ్యాంక్స్‌’ అంటూ క్యాప్షన్‌ని జోడించింది. అయితే ఈ మూవీని షాట్‌గా ‘డీడీఎల్‌జే’ అంటు ఉంటారు ఫ్యాన్స్‌. కాగా ఇప్పటికి ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చిన చూసేందుకు అభిమానులు సిద్ధంగా ఉంటారు.

చదవండి: హీరోయిన్‌ని డైరెక్ట్‌ చేయనున్న నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement