Dilwale Dulhaniya Le jayenge
-
సిమ్రాన్ ట్రైన్‌ని అందుకుని 26 ఏళ్లు
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, అందాల తార కాజోల్ జంటగా నటించిన చిత్రం ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాకి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మూవీతో ఈ ఇద్దరు కూడా స్టార్స్‌గా మారిపోయారు. అయితే ఈ రోజుతో ఈ సినిమా విడుదలై 26 ఏళ్లు పూర్తి అయ్యాయి. దీంతో ఈ సినిమా గురించి ఓ వీడియోని షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది ఇందులో ‘సిమ్రాన్’గా నటించిన కాజోల్. ఆ సినిమాలో క్లైమాక్స్‌లో ట్రైన్లో వెళుతున్న షారుక్ చేతిని అందుకునే సీన్ గుర్తుండే ఉంటుంది. ఈ సీన్‌ని షేర్ చేసింది ఈ బ్యూటీ. దానికి.. ‘సిమ్రాన్ ట్రైన్‌ని అందుకుని 26 ఏళ్లు. ఇంకా మాపై ప్రేమ చూపిస్తున్నందుకు థ్యాంక్స్’ అంటూ క్యాప్షన్‌ని జోడించింది. అయితే ఈ మూవీని షాట్‌గా ‘డీడీఎల్జే’ అంటు ఉంటారు ఫ్యాన్స్. కాగా ఇప్పటికి ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చిన చూసేందుకు అభిమానులు సిద్ధంగా ఉంటారు. చదవండి: హీరోయిన్ని డైరెక్ట్ చేయనున్న నటి View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
'అన్నీ మారిపోయాయి.. ఆ ఒక్కటి తప్పా'
భారత చలన చిత్ర పరిశ్రమలో రికార్డులు తిరగరాసిన దిల్వాలే దుల్హానియా లే జయేంగే సినిమా నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా షారూఖ్ ఖాన్, కాజోల్లకి ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. 4 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా ఏకంగా 250 కోట్లు కలెక్ట్ చేసి రికార్డుల సునామీలు సృష్టించింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ ఒక్క సినిమాతో నేటికీ దేశంలోనే నెం.1 ప్రొడక్షన్ హౌస్‌గా నిలిచి ఉంది. లాక్డౌన్ వరకూ కూడా అంటే గత పాతికేళ్లుగా ముంబైలోని మరాఠా మందిర్‌లో మ్యాట్నీగా లేదంటే మార్నింగ్ షోగా ఈ సినిమా ఆడుతూనే ఉంది. (25 ఏళ్ల దిల్వాలే దుల్హనియా లేజాయేంగే ) నేటితో దిల్వాలే దుల్హానియా లే జయేంగే చిత్రం 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఉదయ్ చోప్రా, ప్రీతి సింగ్ పాత్రలో నటించిన మందిరా బేడీలు సినిమాతో తమకున్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. అనేక అంశాలలో చరిత్ర సృష్టించిన ఈ సినిమాలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని మందిరా అన్నారు. జీవితం చాలా మరిపోయింది. అన్నీ మారిపోయాయి. కానీ ప్రేమకు గుర్తుగా నిలిచే ఎరుపు రంగు మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది అంటూ ఈ సినిమాపై తన ప్రేమను తెలియజేశారు. View this post on Instagram #25yearchallenge !!! 🤟🏽❣️ It’s wonderful to have been a part of a film that has made cinema history on many counts. 👊🏽💥I have changed a lot, life has changed a lot. But Red is still the color of LOVE ! #25yearsofddlj I want to see some Then & Nows from all of you.. @karanjohar @kajol @anaitashroffadajania @iamsrk @yrf A post shared by Mandira Bedi (@mandirabedi) on Oct 20, 2020 at 1:04am PDT A picture of me from the sets of DDLJ. It’s been 25 years!!! Was a truly special and fun experience. The memories will last for ever... #DDLJ25 @yrf pic.twitter.com/jPohN6YdFV — Uday Chopra (@udaychopra) October 20, 2020 -
23 ఏళ్ల తరువాత కూడా అదే మ్యాజిక్ : అల్లు అర్జున్
బాలీవుడ్ క్లాసిక్ దిల్ వాలే దుల్మానియా లేజాయేంగే సినిమా నచ్చని వారంటూ ఉండరు. ముఖ్యంగా ఆ సినిమాలో పాటలు ఎవర్గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. అందుకే ఆ సినిమా భారతీయ సినీ అభిమానులకు మోస్ట్ ఫేవరెట్. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అందుకు మినహాయింపేమి కాదు. తాజాగా ఈ సినిమాకు సంబందించి బన్నీ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. సోమవారం రాత్రి డీడీఎల్ సినిమా చూసిన బన్నీ స్క్రీన్ షాట్ తో పాటు ఆసక్తికర కామెంట్ చేశాడు. ‘1995లో తొలిసారిగా ఈ సినిమాలో తుజే దేఖాతో యే జానా సనమ్ పాటు చూసినప్పుడు నా జీవితంలో హైయ్యస్ట్ మ్యాజిక్ ఫీల్ అయ్యాను. ఇప్పుడు 23 ఏళ్ల తరువాత ఆ పాట మళ్లీ చూశాను. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ ఫీల్ అయ్యాను. నా జీవితంలోనే హైయ్యస్ట్ సినిమాటిక్ మూమెంట్. ఎప్పటికీ’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు బన్నీ. View this post on Instagram Tuje Dekha tho ye jana sanam ... ❤️ I felt the highest magic moment of my Life when I watched it in 1995... and today after 23years I watched it again , and I felt that same magic n that love in my deepest heart . Highest cinematic moment of my life then , now n Forever ❤️ #ddlj #srk #kajol #srkajol #yrf #yashchopra #tujedekhatoyejanasanam A post shared by Allu Arjun (@alluarjunonline) on Nov 26, 2018 at 10:16am PST -
1009 వారాలు
దిల్వాలే దుల్హనియా లే జాయెంగే... షారూఖ్‌ఖాన్, కాజోల్‌ల రోమాంటిక్ మూవీ. మరో కొత్త రికార్డును బ్రేక్ చేసింది. మరాఠా మందిర్ థియేటర్లో విజయవంతమైన 1009 వారాన్ని పూర్తి చేసుకుంది. గురువారం ఉదయం మార్నింగ్ షోతో దీనికి ఎండ్ కార్డ్ పడింది. గత ఏడాది డిసెంబర్లోనే వెయ్యి వారాలు పూర్తి చేసుకున్నప్పటికీ... మరి కొన్ని వారాలు పొడిగించాల్సిందిగా థియేటర్ యాజమాన్యాన్ని యశ్‌రాజ్ ఫిలింస్ కోరింది. వైఆర్ఎఫ్ విజ్ఞప్తి మేరకు ఈ తొమ్మిది వారాలు.. వారానికి మూడు రోజుల చొప్పున మార్నింగ్ 9.15కి షో రన్ చేసిన మరాఠా మందిర్ యాజమాన్యం.. గురువారంతో ఆ షోని నిలిపివేస్తున్నట్టు తెలిపింది. షారూఖ్, కాజోల్‌లకు స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ఓ మనోహర ప్రేమ కావ్యంగా నిలిచిపోయింది.