1009 వారాలు | SRK's 'Dilwale Dulhania Le Jayenge' to be taken down from Maratha Mandir after 1009 weeks | Sakshi
Sakshi News home page

1009 వారాలు

Published Fri, Feb 20 2015 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

1009 వారాలు

1009 వారాలు

దిల్‌వాలే దుల్హనియా లే జాయెంగే... షారూఖ్‌ఖాన్, కాజోల్‌ల రోమాంటిక్ మూవీ. మరో కొత్త రికార్డును బ్రేక్ చేసింది. మరాఠా మందిర్ థియేటర్‌లో విజయవంతమైన 1009 వారాన్ని పూర్తి చేసుకుంది. గురువారం ఉదయం మార్నింగ్ షోతో దీనికి ఎండ్ కార్డ్ పడింది. గత ఏడాది డిసెంబర్‌లోనే వెయ్యి వారాలు పూర్తి చేసుకున్నప్పటికీ... మరి కొన్ని వారాలు పొడిగించాల్సిందిగా థియేటర్ యాజమాన్యాన్ని యశ్‌రాజ్ ఫిలింస్ కోరింది.

వైఆర్‌ఎఫ్ విజ్ఞప్తి మేరకు ఈ తొమ్మిది వారాలు.. వారానికి మూడు రోజుల చొప్పున మార్నింగ్ 9.15కి షో రన్ చేసిన మరాఠా మందిర్ యాజమాన్యం.. గురువారంతో ఆ షోని నిలిపివేస్తున్నట్టు తెలిపింది. షారూఖ్, కాజోల్‌లకు స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ఓ మనోహర ప్రేమ కావ్యంగా నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement