Shah Rukh Khan Fans Fires On Kajol Over Her Comments On Pathaan Collections, Deets Inside - Sakshi
Sakshi News home page

Shah Rukh Fans Trolls Kajol: కాజోల్‌ సరదా వ్యాఖ్యలు.. షారుక్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Published Sun, Jul 16 2023 2:42 PM | Last Updated on Sun, Jul 16 2023 4:37 PM

Shah Rukh Khan Fans Fires On Kajol - Sakshi

బాలీవుడ్‌లో కాజోల్‌, షారుక్‌ ఖాన్‌లది హిట్‌ పెయిర్‌. ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయెంగే, బాజీఘర్‌, దిల్‌వాలేతో పాటు మరో నాలుగు చిత్రాల్లోనూ విరిద్దరు జంటగా నటించారు. అవన్నీ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సూపర్‌ హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. ఇక పలు చిత్రాల్లో కలిసి నటించడం కారణంగా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పటికీ షారుక్‌- కాజోల్‌ స్నేహితులుగానే ఉన్నారు. ఆ చనువు కారణంగానే కాజోల్‌ సరదాగా చేసిన వ్యాఖ్యులు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి. ఆమెపై షారుక్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు.

వివరాల్లోకి వెళితే..ఇటీవల కాలోజ్‌ నటించిన ‘ది ట్రయల్‌’ మూవీ ఇటీవల డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చిత్రబృందంతో కలిసి మీడియా ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా షారుక్‌ ఖాన్‌ గురించి అడగ్గా..‘షారుక్‌, నేను మంచి స్నేహితులం. అతనితో కలిసి నటించే అవకాశం వస్తే ఇప్పటికీ వదులుకోను. మళ్లీ ఆయనతో ఒక రొమాటిక్‌ సాంగ్‌ చేయాలని ఉంది’ అని కాజోల్‌ అన్నారు.

ఒకవేళ షారుక్‌ ఎదురుపడితే ఆయన్ని అడిగే ఒకే ఒక విషయం ఏంటని ప్రశ్నించగా.. ‘పఠాన్‌’ సినిమా నిజమైన కలెక్షన్స్‌ ఎంతో చెప్పమంటాను’అని నవ్వుతూ బదులిచ్చింది. ఆమె సరదాగా అన్న వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదం అయ్యాయి. మా హీరో సినిమాకు వచ్చిన రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ నిజమైనవి కావా? అబద్దం చెప్పాల్సిన అవసరం మా హీరోకి ఏముంది? అని షారుక్‌ ఫ్యాన్స్‌ కాజోల్‌ని ట్రోల్‌ చేస్తుంది. అయితే మరికొంతమంది మాత్రం ఇలా సరదాగా అన్న వ్యాఖ్యలను తప్పుపట్టడం సరికాదని అంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement