
ముంబై: బాలీవుడ్ కథానాయిక కాజోల్‌కు షారూఖ్ ఖాన్ అభిమాని ఒకరు ఆసక్తికర ప్రశ్న సంధించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ఆమె ముచ్చటించారు. ఈ సందర్భంగా షారూఖ్ ఫ్యాన్ నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. షారూఖ్ ఖాన్‌కు ఎందుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని సదరు అభిమాని ప్రశ్నించాడు. దీనికి కాజోల్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘షారూఖ్ కుమారుడు ఇంటికి తిరిగి రావడంతో ఆయన ఆశలన్నీ ఫలించాయి. ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఆయనకు ఉంటుందా?’ అని జవాబిచ్చారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కుని అక్టోబర్ 2న అరెస్టైన షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్.. అక్టోబర్ 30న జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే.
షారూఖ్ ఖాన్ మంగళవారం 56వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. కాజోల్, షారూఖ్ పలు హిట్ సినిమాల్లో కలిసి నటించారు. 2018లో విడుదలైన ‘జీరో’ సినిమా తర్వాత షారూఖ్ మూవీస్ ఇప్పటివరకు విడుదల కాలేదు. షారూఖ్ ఖాన్ ప్రస్తుతం ‘పఠాన్’ సినిమాలో నటిస్తున్నారు. రేవతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది లాస్ట్ హుర్రా’ సినిమాలో కాజోల్ కనిపించనున్నారు. (షారుక్-గౌరీ ప్రేమకథలో ఎన్ని అడ్డంకులో.. చివరికి ఇలా ముగిసింది..)
Comments
Please login to add a commentAdd a comment