వర్మ-మ్యాగీ ఒక ప్రేమకథ! | maggi gift hamper to ramgopal varma | Sakshi
Sakshi News home page

వర్మ-మ్యాగీ ఒక ప్రేమకథ!

Published Wed, Dec 23 2015 7:05 PM | Last Updated on Mon, Oct 8 2018 4:21 PM

వర్మ-మ్యాగీ ఒక ప్రేమకథ! - Sakshi

వర్మ-మ్యాగీ ఒక ప్రేమకథ!

క్రియెటివ్‌ డైరెక్టర్‌, కాంట్రవర్సీ కింగ్‌.. ఇలా ఎన్నైనా చెప్పండి. రాంగోపాల్‌ వర్మ రాంగోపాల్‌ వర్మనే. ఆయన ఎప్పుడూ వార్తల్లో వ్యక్తే. తాజాగా ఒక ప్రేమకథతో ఆయన ట్విట్టర్‌కు ఎక్కారు. అది మ్యాగీ న్యూడిల్స్‌పై ఆయనకున్న ప్రేమ. ఇటీవల నిషేధానికి గురై అనేక కష్టనష్టాలు పడ్డ నెస్లే మ్యాగీ న్యూడిల్స్‌కు వర్మ అడుగడుగునా బాసటగా నిలిచారు. అందుకు రుణం తీర్చుకోవాలి కదా! అందుకే మ్యాగీ కూడా ఆయన ప్రేమను, మద్దతును స్వీకరించింది. ఇందుకు ప్రతిగా ఆయనకు ఓ గిఫ్ట్‌ హ్యాంపర్‌ను పంపిస్తామని తెలిపింది. చిరునామా వివరాలు ఇవ్వమని కోరింది.

దీంతో వర్మ పొంగిపోయారు. దీనిని గౌరవంగా భావించారు. మ్యాగీ బేబి నువ్వు ఇప్పటికీ 20 లక్షల నిమిషాల ఆనందాన్ని కానుకగా ఇచ్చావు. హుమ్మా' అంటూ ఓ ముద్దుపెట్టారు. ఇలా ట్విట్టర్‌లో నడిచిన మ్యాగీ- వర్మ ప్రేమకథను చూసి ఓ అభిమాని స్పందించాడు. షారుఖ్‌ఖాన్, కాజోల్‌ జంటగా నటించిన 'దిల్‌వాలే దుల్హానియా లేజాయెంగే' సినిమా కంటే మధురమైన, అతి సుందరమైన ప్రేమకథ మీదేనంటు కితాబిచ్చాడు. అది కూడా నచ్చేయడంతో వర్మ దానిని రీట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement