జస్వంత్ ఆస్తుల్లో 3 అరబ్ గుర్రాలు, 51 ఆవులు! | 3 Arab horses, 51 cows among Jaswant Singh's assets | Sakshi
Sakshi News home page

జస్వంత్ ఆస్తుల్లో 3 అరబ్ గుర్రాలు, 51 ఆవులు!

Published Tue, Mar 25 2014 3:51 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

జస్వంత్ ఆస్తుల్లో 3 అరబ్ గుర్రాలు, 51 ఆవులు! - Sakshi

జస్వంత్ ఆస్తుల్లో 3 అరబ్ గుర్రాలు, 51 ఆవులు!

బీజేపీ తిరుగుబాటు నేత జస్వంత్ సింగ్ ఆస్తుల జాబితాను ప్రకటించారు. బర్మర్ లోకసభ స్థానంలో  సోమవారం నామినేషన్ సమర్పించిన జస్వంత్ మంగళవారం ఆస్తుల జాబితాను వెల్లడించారు. ఆయన ఆస్తుల విలువ 1,49,83,510. జస్వంత్ ఆస్టుల్లో మూడు అరబ్ గుర్రాలు, 51 థార్పర్కర్ ఆవులున్నాయి.
 
51 ఆవులు జైసల్మర్, బర్మర్ లో ఉన్నట్టు తెలిపారు. తన వద్ద ఉన్న మూడు ఆవుల్లో సౌదీ అరేబియా యువరాజు రెండు ఆవులను బహుకరించారని.. ఆతర్వాత మరో ఆవు జన్మించిందని తెలిపారు. 
 
నామినేషన్ దాఖలు చేసిన తర్వాత జస్వంత్ మాట్లాడుతూ.. బీజేపీని వీడేది లేదు అని స్పష్టం చేశారు. ఒకే వ్యక్తిపై పార్టీ ఆధారపడటం చాలా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకే వ్యక్తిపై ఆధారపడటం మంచిది కాదని జస్వంత్ సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement