ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ గురువారం ముగిసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసశ్రీనరేష్, పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు జస్వంత్‌సింగ్, జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ పార్లమెంటు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి మొత్తం 27 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో ఒక్కటి కూడా తిరస్కరణకు గురికాలేదు. నామినేషన్ పత్రాలను పరిశీలించిన కలెక్టర్ అన్నీ సక్రమంగా ఉన్నాయని, ఆమోదించినట్లు ప్రకటించారు. కాగా, పది అసెంబ్లీ స్థానాలకు మొత్తం 232 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 36 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 196 మంది నామినేషన్లు ఆమోదించారు.
ఉపసంహరణల అనంతరం చివరకు ఎంతమంది బరిలో ఉంటారో తేలనుంది. ఓటరు జాబితాలో క్రమ సంఖ్య తప్పుగా ఉండడం, ప్రతిపాదించే వారు లేకపోవడం, పార్టీల తరఫున బీ-ఫాంలు లేక, అసలు అభ్యర్థికి డమ్మీగా వేయడం, అఫిడెవిట్లు లేక, వయస్సు నిండకపోవడం, బలపరిచే వారు లేక...ఇలా పలుకారణాలతో పరిశీలన అనంతరం అధికారులు నా మినేషన్లు తిరస్కరించారు. ఎక్కువగా కొత్తగూడెంలో 8మంది, పాలేరు నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యా యి.
నియోజకవర్గాల వారీగా తి రస్కరణకు గురైన అభ్యర్థుల వివరాలు....
పినపాక : బాణోతు శోభ (టీఆర్‌ఎల్డీ), తెల్లం నర్సింహారావు (స్వతంత్ర), బండారు రాజీవ్‌గాంధీ (స్వతంత్ర).
ఇల్లెందు : చుంచు నాగేశ్వరరావు (టీఆర్‌ఎస్), బాణోతు హరిసింగ్ (టీడీపీ), ఊకే ప్రభాకర్ (టీడీపీ), లావుడ్యా నాగేశ్వర్‌రావు (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), శ్రీకాంత్ కొమరం (స్వతంత్ర), నునావత్ హనుమంతు (స్వతంత్ర).
పాలేరు : రాంరెడ్డి గోపాల్‌రెడ్డి (కాంగ్రెస్), బత్తుల లెనిన్ (సీపీఎం), బాణోతు వెంకన్ననాయక్ (స్వతంత్ర), నునావత్ బాణ్యానాయక్ (స్వతంత్ర), గట్టుమల్ల శంకర్ (స్వతంత్ర), బెరైడ్డిభువన(స్వతంత్ర), తేజావత్ బాబు( స్వతంత్ర),
వైరా:భూక్యా వీరప్రసాద్ (స్వతంత్ర), ధరావత్ కాన్షిరాం (స్వతంత్ర),మూడు రవి(సీపీఐ),ఎ.నాగునాయక్( స్వతంత్ర), బాణోత్ దేవులా (టీడీపీ).
ఖమ్మం: షేక్ మదార్‌సాహేబ్ (టీడీపీ), షేక్ పాషా (జై సమైకాంధ్ర),బండారు అంజన్‌రాజు( స్వతంత్ర) ,నల్లమోతు శ్రావణ్‌కుమార్( స్వతంత్ర).
కొత్తగూడెం: మహ్మద్ అబ్దుల్ మజీద్(బీజేపీ), మళోత్ రాందాస్(టీడీపీ), కోనేరు పూర్ణచందర్‌రావు(టీడీపీ),తాండ్ర రవీందర్(బీఎస్పీ) ,షేక్ సాబీర్‌పాషా( సీపీఐ), గుగులోత్ రాజేష్ ( స్వతంత్ర ), వనమా వెంకటేశ్వరరావు(స్వతంత్ర) ,ఊదరా పూర్ణచందర్‌రావు(స్వతంత్ర).
మధిర : దారేల్లి అశోక్ (వైఎస్‌ఆర్‌సీపీ)
భద్రాచలం: సరియం కోటేశ్వరరావు(సీపీఎం).
అశ్వారరావుపేట: వగ్గెల హేమంత్‌కుమార్ (కాంగ్రెస్)
సత్తుపల్లి: తుమ్మలరాజేష్‌కుమార్ (జై సమైక్యాంధ్ర)
36 అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
Published Fri, Apr 11 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM
Advertisement
Advertisement