Srinivasa srinares
-
బోగస్ కార్డులు ఏరివేయాలి
ఖమ్మం కలెక్టర్ : జిల్లాలో బోగస్ రేషన్ కార్డులను గుర్తించి వెంటనే తొలగించాలని కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ అధికారులను ఆదేశించారు. ఆధార్‌కార్డులతో రేషన్‌కార్డుల అనుసంధానం, పేద దళితులకు భూపంపిణీ, మీ-సేవ అర్జిల పరిష్కారం తది తర అంశాలపై డివిజన్, మండల అధికారులతో కలెక్టరేట్ నుంచి ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రేషన్‌కార్డులతో ఆధార్‌కార్డుల అనుసంధానం ప్రక్రియను ఈ నెలాఖరులోగా నూరుశాతం పూర్తి చేయాలని ఆదేశించా రు. దీని ద్వారా రేషన్‌లో జరుగుతున్న అక్రమాల కు అడ్డుకట్టవేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వర కు 7లక్షల 70 వేల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయ ని, 65.4 శాతం కార్డులకు సంబంధించి ఆధార్ అనుసంధానం పూర్తయ్యిందని తెలిపారు. గుం డాల, అశ్వారావుపేట, ఖమ్మం అర్బన్, ఇల్లెందు మండలాల్లో ఆధార్ అనుసంధానంలో వెనకబాటుకు గల కారణాలను తహశీల్దార్లు, ఆర్డీవోలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కొరత, కంప్యూటర్ల సమస్య తదితర కారణాల వల్ల వెనుకబడి ఉన్నామని వారు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ నెలాఖరులోగా రేషన్‌కార్డుల ఆధార్ పూర్తి చేయాలని సూచిం చారు. మీ-సేవ అర్జిలు రెండు నెలలుగా చాలా మండలాల్లో అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదన్నారు. కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాలు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయని, ఈ విషయంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పేద దళితులకు మొదటి దశలో మైదాన ప్రాంతాల్లో మూడెకరాల భూమి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొదటిగా అత్యధిక ఎస్సీ కుటుంబాలు ఉన్న 17 గ్రామాల్లో స్థితిగతులపై సర్వేకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ గ్రామాల్లో ప్రభుత్వ, అమ్మకానికి సిద్ధంగా ఉన్న భూముల వివరాలను రెవెన్యూ గ్రామం యూ నిట్‌గా సేకరించాలన్నారు. కుటుంబాల గుర్తింపునకు రేషన్‌కార్డును ప్రాతిపాదికగా తీసుకోవాలన్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి నుంచి ఇటీవల వలస వచ్చిన ఎస్సీ కుటుంబాలు లబ్ధిదారుల జాబితాలో లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమం పాదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చే యాలని అధికారులను ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి గౌరీశంకర్, డీఎం సాంబశివరావు పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 11మంది అదనపు సహాయ రిటర్నింగ్ అధికారులు, ఏడుగురు అబ్జర్వర్ల నియామకానకి ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాకు 2600 పవర్ ప్యాక్స్ అవసరమన్నారు. 1.24 కోట్ల బడ్జెట్ కేటాయింపునకు ప్రతిపదనలు పంపినట్టు చెప్పా. ఈవీఎంలను భద్రపరచేందుకు నిర్మిస్తున్న గోడౌన్ గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తయినట్టు చెప్పారు. మొదటి అంతస్తు పనులు పురోగతిలో ఉన్నాయని, దీనికిగాను 14.74 లక్షల రూపాయలకు ప్రతిపాదనలు పంపామని అన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని, కౌంటింగ్ ఏజెంట్ల జాబితా ఇవ్వాలని కోరామని అన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసినట్టు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి డ్యూటీలు వేశామన్నారు. కౌంటింగ్‌ను పటిష్టంగా నిర్వహించేందుకు వివిధ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. స్ట్రాంగ్ రూముల నుంచి కౌంటింగ్ కేంద్రాల వరకు బ్యాలెట్ ఈవీఎంలను తీసుకొచ్చేప్పుటి నుంచి ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వీడియో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు, మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పటిష్ట చర్యలు చేపట్టినట్టు చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ పీవో దివ్య, జిల్లా రెవెన్యూ అధికారి శివ శ్రీనివాస్, ఏఓ చూడామణి, ఎన్నికల అధికారి యూసఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
36 అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ గురువారం ముగిసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసశ్రీనరేష్, పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు జస్వంత్‌సింగ్, జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ పార్లమెంటు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి మొత్తం 27 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో ఒక్కటి కూడా తిరస్కరణకు గురికాలేదు. నామినేషన్ పత్రాలను పరిశీలించిన కలెక్టర్ అన్నీ సక్రమంగా ఉన్నాయని, ఆమోదించినట్లు ప్రకటించారు. కాగా, పది అసెంబ్లీ స్థానాలకు మొత్తం 232 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 36 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 196 మంది నామినేషన్లు ఆమోదించారు. ఉపసంహరణల అనంతరం చివరకు ఎంతమంది బరిలో ఉంటారో తేలనుంది. ఓటరు జాబితాలో క్రమ సంఖ్య తప్పుగా ఉండడం, ప్రతిపాదించే వారు లేకపోవడం, పార్టీల తరఫున బీ-ఫాంలు లేక, అసలు అభ్యర్థికి డమ్మీగా వేయడం, అఫిడెవిట్లు లేక, వయస్సు నిండకపోవడం, బలపరిచే వారు లేక...ఇలా పలుకారణాలతో పరిశీలన అనంతరం అధికారులు నా మినేషన్లు తిరస్కరించారు. ఎక్కువగా కొత్తగూడెంలో 8మంది, పాలేరు నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యా యి. నియోజకవర్గాల వారీగా తి రస్కరణకు గురైన అభ్యర్థుల వివరాలు.... పినపాక : బాణోతు శోభ (టీఆర్ఎల్డీ), తెల్లం నర్సింహారావు (స్వతంత్ర), బండారు రాజీవ్‌గాంధీ (స్వతంత్ర). ఇల్లెందు : చుంచు నాగేశ్వరరావు (టీఆర్ఎస్), బాణోతు హరిసింగ్ (టీడీపీ), ఊకే ప్రభాకర్ (టీడీపీ), లావుడ్యా నాగేశ్వర్రావు (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), శ్రీకాంత్ కొమరం (స్వతంత్ర), నునావత్ హనుమంతు (స్వతంత్ర). పాలేరు : రాంరెడ్డి గోపాల్‌రెడ్డి (కాంగ్రెస్), బత్తుల లెనిన్ (సీపీఎం), బాణోతు వెంకన్ననాయక్ (స్వతంత్ర), నునావత్ బాణ్యానాయక్ (స్వతంత్ర), గట్టుమల్ల శంకర్ (స్వతంత్ర), బెరైడ్డిభువన(స్వతంత్ర), తేజావత్ బాబు( స్వతంత్ర), వైరా:భూక్యా వీరప్రసాద్ (స్వతంత్ర), ధరావత్ కాన్షిరాం (స్వతంత్ర),మూడు రవి(సీపీఐ),ఎ.నాగునాయక్( స్వతంత్ర), బాణోత్ దేవులా (టీడీపీ). ఖమ్మం: షేక్ మదార్సాహేబ్ (టీడీపీ), షేక్ పాషా (జై సమైకాంధ్ర),బండారు అంజన్‌రాజు( స్వతంత్ర) ,నల్లమోతు శ్రావణ్‌కుమార్( స్వతంత్ర). కొత్తగూడెం: మహ్మద్ అబ్దుల్ మజీద్(బీజేపీ), మళోత్ రాందాస్(టీడీపీ), కోనేరు పూర్ణచందర్రావు(టీడీపీ),తాండ్ర రవీందర్(బీఎస్పీ) ,షేక్ సాబీర్‌పాషా( సీపీఐ), గుగులోత్ రాజేష్ ( స్వతంత్ర ), వనమా వెంకటేశ్వరరావు(స్వతంత్ర) ,ఊదరా పూర్ణచందర్రావు(స్వతంత్ర). మధిర : దారేల్లి అశోక్ (వైఎస్ఆర్సీపీ) భద్రాచలం: సరియం కోటేశ్వరరావు(సీపీఎం). అశ్వారరావుపేట: వగ్గెల హేమంత్‌కుమార్ (కాంగ్రెస్) సత్తుపల్లి: తుమ్మలరాజేష్కుమార్ (జై సమైక్యాంధ్ర)