ఖమ్మం కలెక్టర్ : జిల్లాలో బోగస్ రేషన్ కార్డులను గుర్తించి వెంటనే తొలగించాలని కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ అధికారులను ఆదేశించారు. ఆధార్‌కార్డులతో రేషన్‌కార్డుల అనుసంధానం, పేద దళితులకు భూపంపిణీ, మీ-సేవ అర్జిల పరిష్కారం తది తర అంశాలపై డివిజన్, మండల అధికారులతో కలెక్టరేట్ నుంచి ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రేషన్‌కార్డులతో ఆధార్‌కార్డుల అనుసంధానం ప్రక్రియను ఈ నెలాఖరులోగా నూరుశాతం పూర్తి చేయాలని ఆదేశించా రు. దీని ద్వారా రేషన్‌లో జరుగుతున్న అక్రమాల కు అడ్డుకట్టవేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వర కు 7లక్షల 70 వేల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయ ని, 65.4 శాతం కార్డులకు సంబంధించి ఆధార్ అనుసంధానం పూర్తయ్యిందని తెలిపారు. గుం డాల, అశ్వారావుపేట, ఖమ్మం అర్బన్, ఇల్లెందు మండలాల్లో ఆధార్ అనుసంధానంలో వెనకబాటుకు గల కారణాలను తహశీల్దార్లు, ఆర్డీవోలను అడిగి తెలుసుకున్నారు.
సిబ్బంది కొరత, కంప్యూటర్ల సమస్య తదితర కారణాల వల్ల వెనుకబడి ఉన్నామని వారు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ నెలాఖరులోగా రేషన్‌కార్డుల ఆధార్ పూర్తి చేయాలని సూచిం చారు. మీ-సేవ అర్జిలు రెండు నెలలుగా చాలా మండలాల్లో అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదన్నారు. కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాలు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయని, ఈ విషయంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పేద దళితులకు మొదటి దశలో మైదాన ప్రాంతాల్లో మూడెకరాల భూమి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
జిల్లాలో మొదటిగా అత్యధిక ఎస్సీ కుటుంబాలు ఉన్న 17 గ్రామాల్లో స్థితిగతులపై సర్వేకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ గ్రామాల్లో ప్రభుత్వ, అమ్మకానికి సిద్ధంగా ఉన్న భూముల వివరాలను రెవెన్యూ గ్రామం యూ నిట్‌గా సేకరించాలన్నారు. కుటుంబాల గుర్తింపునకు రేషన్‌కార్డును ప్రాతిపాదికగా తీసుకోవాలన్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి నుంచి ఇటీవల వలస వచ్చిన ఎస్సీ కుటుంబాలు లబ్ధిదారుల జాబితాలో లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమం పాదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చే యాలని అధికారులను ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి గౌరీశంకర్, డీఎం సాంబశివరావు పాల్గొన్నారు.
బోగస్ కార్డులు ఏరివేయాలి
Published Thu, Jul 3 2014 2:31 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement
Advertisement