న్యూఢిల్లీ: విపక్షాల ఆరోపణల నడుమ బుధవారం ఆరంభమైన లోక్‌సభలో చర్చలు గందరగోళానికి తావివ్వడంతో సభను సోమవారానికి వాయిదా వేయక తప్పలేదు. లోక్‌సభలో విపక్షాలు తిరిగి గందరగోళ సృష్టించడంతో సభ వాయిదా వేశారు. ఈ రోజు గుర్ఱాలాండ్ అంశం ప్రధానంగా చర్చకు దారి తీసింది.
కొందరు ఎంపీలు పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయాన్ని జరగనివ్వలేదు. బీజేపీ సభ్యుడు జశ్వంత్ సింగ్ మాత్రం గుర్ఱాలాండ్ ప్రత్యేక రాష్ర్ట అంశానికి తొందరగా పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 2 గం.లకు తిరిగి ఆరంభమైన లోక్ సభ తిరగి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. వరుసుగా నాలుగు రోజులు పార్లమెంట్ కు సెలవు దినాలు కావడంతో సభ తిరిగి సోమవారం ఆరంభమవుతుంది.
లోక్‌సభ సోమవారానికి వాయిదా
Published Wed, Aug 14 2013 4:47 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement