రూ. 21, రూ. 51 నోట్లను ప్రవేశపెట్టే యోచన లేదని ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభకు తెలిపింది.
న్యూఢిల్లీ: రూ. 21, రూ. 51 నోట్లను ప్రవేశపెట్టే యోచన లేదని ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభకు తెలిపింది. దీనికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనా తమ పరిశీలనలో లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ వెల్ల డించారు.
బీజేపీ ఎంపీ పరేశ్ రావెల్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అలాగే రూ. 50, రూ.100 నోట్లను రద్దు చేసే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద లేదన్నారు. వినియోగదారులు బ్యాంకు ఖాతాల్లో కనీస మొత్తాన్ని ఉంచకపోతే జరిమానా విధించాలన్న యోచనను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ లోక్‌సభలో ప్రభుత్వాన్ని, బ్యాంకులను డిమాండ్ చేసింది.