కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం గాయపడిన జశ్వంత్ సింగ్ను చికిత్స నిమిత్తం ఆర్మీ ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించారు. ఈరోజు ఉదయం ఆయన తన నివాసంలో కళ్లు తిరిగి పడిపోయారు. జశ్వంత్ తలకు తీవ్ర గాయం అయింది. ఆయన కోమాలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.
బీజేపీ అగ్రనేత అద్వానీ ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రికి వెళ్లి జస్వంత్‌సింగ్‌ను పరామర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా జశ్వంత్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.