
బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీ కపూర్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. 2018 సెప్టెంబర్‌లో క్యాన్సర్ చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లిన దాదాపు ఏడాది తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరోసారి హాస్పిటల్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరైన సమయంలో రిషీ కపూర్ అనారోగ్యానికి గురికావడంతో.. ఆయనను ఆస్పత్రిలో చేర్పించినట్టుగా తెలుస్తోంది. రిషీ కపూర్ వెంట ఆయన భార్య నీతూ కపూర్ కూడా ఉన్నారు.
ఈ విషయం తెలుసుకున్న రణబీర్ కపూర్, ఆలియా భట్‌లు వెంటనే ఢిల్లీకి బయలుదేరారు. అయితే రిషీ కపూర్ ఏ సమస్యతో హాస్పిటల్‌లో చేరాడనేదానిపై మాత్రం స్పష్టత లేదు. కాగా, అర్మాన్ జైన్ మెహందీ ఫంక్షన్‌లో రిషీ కపూర్ కుటుంబసభ్యులు కనిపించకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment