
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీకపూర్ బుధవారం అస్వస్థతకు గురుయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషీకపూర్‌ను ఆయన కుటుంబసభ్యులు ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ చేర్పించారు. ఈ విషయాన్ని రిషి కపూర్ సోదరుడు రణ్‌ధీర్ కపూర్ మీడియాకు వెల్లడించారు. ‘రిషీకపూర్ హాస్పిటల్‌లో ఉన్నారు. ఆయన క్యాన్సర్, శాస్వకోస సమస్యతో బాధపడుతున్నారు. అందుకే హాస్పిటల్‌లో చేర్పించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది’ అని రణ్‌ధీర్ కపూర్ తెలిపారు.
కాగా, క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషీకపూర్ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతం గతేడాది సెప్టెంబర్‌లో ఆయన భారత్‌కు వచ్చారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరైన సమయంలో అస్వస్థతకు లోనుకావడంతో అక్కడే హాస్పిటల్‌లో చేర్పించారు. ఆ సమయంలో తాను ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టుగా రిషీకపూర్ వెల్లడించారు. ఢిల్లీ నుంచి ముంబై వచ్చిన తర్వాత వైరల్ ఫీవర్‌తో ఆయన మరోసారి హాస్పిటల్‌లో చేరారు. అయితే త్వరగానే ఆయన డిశ్చార్జి అయ్యారు.
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రిషీకపూర్.. ఏప్రిల్ 2 నుంచి తన ట్విటర్ అకౌంట్‌లో ఎలాంటి పోస్టులు చేయలేదు. ప్రస్తుతం ఆయన హాలీవుడ్ చిత్రం ‘ది ఇంటర్న్’ హిందీ రీమేక్‌లో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ కథానాయికగా నటింస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్‌కి బ్రేక్ పడింది.
చదవండి : దేశ ప్రతిష్టను పెంచిన నటుడు
Comments
Please login to add a commentAdd a comment