ప్రముఖ రచయిత్రికి అస్వస్థత
కోల్‌కతా: ప్రముఖ రచయిత్రి, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత మహాశ్వేతాదేవి (89) అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్స కొనసాగుతోందని బెల్లె వ్యూ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
కాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం మహాశ్వేతా దేవిని పరామర్శించారు. తొందరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.