unwell
-
ప్రముఖ గాయని పి.సుశీలకు అస్వస్థత
తమిళ సినిమా: ప్రఖ్యాత గాయని పి.సుశీల శనివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను చెన్నై మైలాపూర్‌లోని కావేరి ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు వెలువడుతున్నాయి.పి.సుశీల కడుపునొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరారని ఆస్పత్రి వైద్యసిబ్బంది తెలిపారు. అది సాధారణ కడుపునొప్పేనని, ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. పి.సుశీల ఆరోగ్య విషయమై సినీవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
మంత్రి వేణుకు అస్వస్థత
సాక్షి, అమరావతి: బీసీ సంక్షేమ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి వైద్య సేవలు పొందారు. కోలుకున్న ఆయన అనంతరం మరిన్ని వైద్య పరీక్షల కోసం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం డాక్టర్ సలహా మేరకు ఆస్పత్రి నుంచి మంత్రి వేణు డిశ్చార్జ్ కానున్నారు. మంత్రి ఆరోగ్యంపై సీఎం వైఎస్ జగన్ ఫోన్ చేసి ఆరా తీశారు. చదవండి: Fact Check: గంతలు కట్టుకొని ‘గుంతల కథ’ -
భార్యకు అస్వస్థత, కొడుకు విదేశాల్లో ఉన్నాడు!ఐనా సిసోడియాకు నో బెయిల్
లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సీసోడియా బెయిల్ మంజూరు చేయాల్సిందిగా మరోసారి ఢిల్లీ కోర్టుని అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన తరుఫు లాయర్ సిసోడియా భార్యకు అస్వస్థతని, కొడుకు విదేశాల్లో ఉన్నాడని అందువల్ల ఆయనే తన భార్యను చూసుకోవాల్సి ఉందని కోర్టుకి తెలిపారు. ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్టు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అతని బెయిల్‌ని వ్యతిరేకిస్తూ వస్తోంది. అతను ప్రభుత్వంలో అత్యున్నత పదవిలో ఉన్నాడని కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రభావితం చేయగలడంటూ బెయిల్ నిరాకరించింది సీబీఐ. ఐతే సిసోడియా సీబీఐ దర్యాప్తుకు తాను సహకరిస్తానని, సోదాల్లో తనకు వ్యతిరేకంగా ఎలాంటి నేరారోపణలు లేవని సిసోడియా తరుఫు లాయర్ వాదించారు. ఇకపై అతనికి కస్టడీ అవసరం లేదని ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన తరుఫు న్యాయవాది చెప్పారు. కానీ సీబీఐ మాత్రం సాక్షులను ప్రభావితం చేయగలడని, దర్యాప్తును అడ్డుకోగలడని వాదిస్తోంది. ఐతే సిసోడియ న్యాయవాది మాత్రం ఆయనపై ఆరోపించిన నేరాలకు ఏడేళ్ల కంటే తక్కువ జైలు శిక్షే పడుతుందని, ఇకపై ఎలాంటి జైలు శిక్ష విధించడం సమర్థనీయం కాదని కోర్టుకి విన్నవించారు. సిసోడియా 18 పోర్ట్‌ఫోలియాలను కలిగి ఉన్నాడని, అతను ఉపయోగించిన ఫోన్లు, కీలకమైన ఫైళ్లను అతను ధ్వంసం చేశాడని, ఇదేమి తెలిసీ తెలియకుండా చేసిన పని కాదని ఉద్దేశపూర్వకంగా చేసిందేనని నొక్కి చెబుతోంది సీబీఐ. అలాగే ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి సీబీఐకు 60 రోజులు సమయం పడుతుందని, ఆయన బయటకు వస్తే దర్యాప్తు పక్కదోవ పట్టే ప్రమాదం ఉందని పేర్కొంది. (చదవండి: మనీష్ సిసోడియాకు మరోసారి చుక్కెదురు..బెయిల్ విచారణ వాయిదా..) -
ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు అస్వస్థత
-
ఏపీ గవర్నర్ విశ్వభూషణ్‌కు అస్వస్థత.. హెల్త్ బులెటిన్ విడుదల
AP Governor Biswabhusan Harichandan is Unwell: సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యంపై ఏఐజీ హస్మిటల్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 88 ఏళ్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నవంబర్ 17న మధ్యాహ్నం 1 గంటకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో అడ్మిట్ అయ్యారని వైద్యులు పేర్కొన్నారు. అయితే గవర్నర్‌కు నవంబర్ 15న కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. కాగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వివరాలు తెలుసుకున్న సీఎం జగన్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఏఐజీ చైర్మన్, సీనియర్ వైద్యుడు డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డితో సీఎం నేరుగా ఫోన్లో మాట్లాడారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యంపై వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. (చదవండి: మరోసారి మెరిసిన ఏపీ పోలీస్) -
శరద్‌పవార్‌కు అనారోగ్యం, కార్యక్రమాలన్నీ రద్దు
-
శరద్‌పవార్‌కు అనారోగ్యం, కార్యక్రమాలన్నీ రద్దు
సాక్షి, ముంబై: ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్ పవార్ (80) అనారోగ్యానికి గురయ్యారు. శరద్ పవార్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, శస్త్రచికిత్స నిమిత్తం బుధవారం ఆసుపత్రిలో చేరనున్నారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. హోం మంత్రి అమిత్ షాతో శరద్ పవార్ రహస్య మంతనాలు జరిపారంటూ పుకార్లు షికార్లు చేస్తున్న తరుణంలో ఆయన అనారోగ్యం వార్త శ్రేణుల్లో ఆందోళన నింపింది. ఎన్సీపీ ప్రతినిధి నవాబ్ మాలిక్ శరద్‌పవార్ అనారోగ్యం వివరాలపై సోమవారం ట్వీట్ చేశారు. ఆదివారం సాయంత్రం కడుపునొప్పి రావడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా, పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్టుగా తేలిందన్నారు. దీంతో తదుపరి సమాచారం అందించేంత వరకు ఆయన కార్యక్రమాలన్నీ రద్దైనట్టు మాలిక్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం బ్లడ్ థిన్నర్ (రక్తం గడ్డ కట్టకుండా వుండే) మందులు వాడుతున్న నేపథ్యంలో 2021, మార్చి 31న ఆసుపత్రిలో చేరతారని, ఎండోస్కోపీ, అనంతరం శస్త్రచికిత్స జరగనుందని వెల్లడించారు. అటు తన ఆరోగ్యంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, మహారాష్ట్ర నవనిర్మాన్ సేన నాయకుడు రాజ్ ఠాక్రే , ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన ఆరోగ్యంపై ఆరాతీశారని శరద్ పవార్ ట్వీట్‌చేశారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. హోం మంత్రి అమిత్ షా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మధ్య కీలక భేటీ జరిగిందంటూ మీడియాలో వార్తలు వ్యాపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను ఎన్సీపీ ఖండించింది. అలాంటిదేమీలేదని, ఇదంతా బీజేపీ రాజకీయ ఎత్తుగడలో భాగమని కొట్టి పారేసింది. అటు ఈ వ్యవహారంపై అమిత్ షాను ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా మౌనాన్ని ఆశ్రయించారు. ప్రతి విషయాన్నీ బహిర్గతం చేయ లేమంటూ వ్యాఖ్యానించారు. కాగా పవార్ గతంలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. Received a phone call from Shri @drharshvardhan ji to check about my health. Appreciate him checking on my health and well-being. — Sharad Pawar (@PawarSpeaks) March 29, 2021 Kind attention Our party president Sharad Pawar saheb was feeling a little uneasy due to a pain in his abdomen last evening and was therefore taken to Breach Candy Hospital for a check up. Upon diagnosis it came to light that he has a problem in his Gall Bladder. — Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) March 29, 2021 -
హిల్లరీ క్లింటన్‌కు అస్వస్థత
-
హిల్లరీ క్లింటన్‌కు అస్వస్థత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ స్వల్ప అనారోగ్యానికి గురైయ్యారు. 9/11 మెమోరియల్ ఈవెంట్ లో పాల్గొన్న హిల్లరీ శరీర ఉష్ణోగ్రతలో విపరీతమైన మార్పులు చోటు చేసుకోవడంతో ఆమె సిబ్బంది సాయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. న్యూయార్క్ లో నివసిస్తున్న తన కూతురు నివాసంలో ఆమె ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. హిల్లరీ అక్కడ త్వరగా కోలుకుంటున్నట్లు సమాచారం. ఈ ఘటనతో హిల్లరీ ఆరోగ్య పరిస్ధితి అధ్యక్షపదవికి సరిపోదని అంటున్న రిపబ్లికన్ పార్టీ వాదనలకు ఆజ్యం పోసినట్లు అయింది. 68 ఏళ్ల హిల్లరి చాలా రకాల వ్యాధులతో బాధపడుతూ ఉండొచ్చని రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హిల్లరీ అనారోగ్యానికి గురికావడంపై ఆమె ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. ఆమె మానసిక స్థితిపై అనుమానం వ్యక్తం చేశారు. ఇకహిల్లరీ ఆరోగ్య పరిస్థితి రిపబ్లికన్స్ కు వరంగా మారే అవకాశం ఉందని అక్కడి రాజకీయ పండితులు అంటున్నారు. 47శాతం ఓట్లతో అధ్యక్షపదవి రేసులో ముందంజలో ఉన్న హిల్లరీకి ఆమె ఆరోగ్యం కారణంగా మూల్యం చెల్లించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా హిల్లరీకి న్యూమోనియా సోకినట్లు ఆమె వ్యక్తిగత డాక్టర్ తెలిపారు. దీంతో సోమవారం నిధుల సమీకరణ కోసం కాలిఫోర్నియాలో జరగనున్న సభను హిల్లరీ అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. -
ప్రముఖ రచయిత్రికి అస్వస్థత
కోల్‌కతా: ప్రముఖ రచయిత్రి, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత మహాశ్వేతాదేవి (89) అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్స కొనసాగుతోందని బెల్లె వ్యూ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం మహాశ్వేతా దేవిని పరామర్శించారు. తొందరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. -
నాకు మంచి గుణపాఠం...
ముంబై: నోబెల్ బహుమతి గెల్చుకున్నందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామాతో డిన్నర్ ఉన్నాసరే .. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.. అలా చేస్తే మీ శరీరం నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది.. కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుంది.. దయచేసి మీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధగా ఉండకండి అని గట్టి సలహా ఇస్తున్నారు ప్రఖ్యాత గాయకుడు కైలాష్ ఖేర్. న్యూయార్క్ నుంచి వచ్చీ రావడంతోనే అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యానంటూ ఆయన కామెంట్ చేశారు. తాను ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటో ఒకదాన్ని ఆయన ఈ సందర్భంగా శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్లనే తొలిసారి గుజరాత్లో ఏర్పాటుచేసిన ఒక షోను రద్దు చేసుకున్నానని కైలాష్ తెలిపారు. ఇది తనకు మంచి గుణపాఠమని, అందుకే ఆరోగ్యం విషయంలో ఎవ్వరూ అశ్రద్ధగా ఉండొద్దని, ఎప్పటికీ ప్రపంచమంతా ఆరోగ్యంతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు. తేరీ దీవానీ.. దీవానీ అంటూ సంగీతాభిమానులను మైమరపింపజేసిన గాయకుడు కైలాష్ అనారోగ్యం పాలై ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ఎంపీ కొనకళ్ల నారాయణ పరిస్థితి విషమం
కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు పరిస్థితి విషమించింది. లోక్ సభలో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో తీవ్రంగా ఒత్తడికి లోనైన ఆయనకు గుండెపోటు రావడంతో నిండు సభలోనే ఆయన కుప్పకూలిపోయారు. సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ రాష్ట్రాల ఎంపీలు, మార్షల్స్ కూడా సీమాంధ్ర ప్రాంత ఎంపీలను అదుపు చేయడానికి పిడిగుద్దులు కురిపించారు. సరిగ్గా ఆ సమయంలోనే కొనకళ్ల నారాయణ కుప్పకూలిపోయారు. వాయిదా అనంతరం సభ జరుగుతున్న సమయంలో ఆయన ఒక్కసారిగా గుండె పట్టుకుని కూలిపోయారు. దాంతో పార్లమెంట్ సిబ్బంది...కొనకళ్ల నారాయణను హుటాహుటీన రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి కరొనరీ కేర్ యూనిట్లో చేర్చి చికిత్స చేయించినా.. ఆయన పరిస్థితి మరింత విషమించడంతో కొనకళ్లను హుటాహుటిన అక్కడి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు అంటున్నారు. అంతకు ముందు కొనకళ్ల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తమ ప్రాంత ప్రజల మనోభావాలను తెలిపేందుకు కూడా సభలో అవకాశం ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ కుట్రపూరితంగా తమపై దాడికి యత్నించిందన్నారు. కాంగ్రెస్ ఎంపీలు తమపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. తమపై దాడికి పాల్పడే... పైపెచ్చు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని కొనకళ్ల మండిపడ్డారు. కాగా లోక్‌సభలో పెప్పర్ స్ప్రే ఘాటుకు అస్వస్థతకు గురైన ముగ్గురు ఎంపీలను ఆర్ఎమ్ఎల్ ఆస్పత్రికి తరలించారు. ముఖం మండుతుందని వారికి మందులు ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు.