![popular singer p sushila is unwell](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/08/18/suseela.jpg.webp?itok=n9A2NuRF)
తమిళ సినిమా: ప్రఖ్యాత గాయని పి.సుశీల శనివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను చెన్నై మైలాపూర్‌లోని కావేరి ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు వెలువడుతున్నాయి.
పి.సుశీల కడుపునొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరారని ఆస్పత్రి వైద్యసిబ్బంది తెలిపారు. అది సాధారణ కడుపునొప్పేనని, ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. పి.సుశీల ఆరోగ్య విషయమై సినీవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
![](/sites/default/files/inline-images/16_6.png)
Comments
Please login to add a commentAdd a comment