p.susheela
-
ప్రముఖ గాయని పి.సుశీలకు అస్వస్థత
తమిళ సినిమా: ప్రఖ్యాత గాయని పి.సుశీల శనివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను చెన్నై మైలాపూర్‌లోని కావేరి ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు వెలువడుతున్నాయి.పి.సుశీల కడుపునొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరారని ఆస్పత్రి వైద్యసిబ్బంది తెలిపారు. అది సాధారణ కడుపునొప్పేనని, ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. పి.సుశీల ఆరోగ్య విషయమై సినీవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
గాయకులకు జీవితసాఫల్య పురస్కారాలు
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి ప్రశాంతి నిలయం సాయికుల్వంత్ హాలులో గాయకులకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు. ప్రముఖ గాయని పి.సుశీలతోపాటు దానా గిలెస్పీలను ఈశ్వరమ్మ ఉమెన్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చేతనారాజు, అరకు ఎంపీ కొత్తపల్లి గీత సత్కరించి పురస్కారాలు అందజేశారు. సత్యసాయిబాబా సన్నిధిలో లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డులు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా దానా గిలెస్పీ కర్ణాటక సంగీతంతో సత్యసాయి గీతాలతో మైమరిపించారు. సత్యసాయి తమ జీవితాలకు మూలస్తంభం లాంటివారని పురస్కార గ్రహీతలు పేర్కొన్నారు. అనంతరం సత్యసాయి ప్రైమరీ స్కూల్ విద్యార్థులు సత్యసాయి, శివుడు, షిర్డీసాయి పలు అవతార ఘట్టాలను వేదికపై ప్రస్ఫుటింపజేశారు. నాటికలతో పాటు నృత్యాలు చేస్తూ మహిళా దినోత్సవాన్ని రంజింపజేశారు. అనంతరం ఈశ్వరమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహుతులను సన్మానించారు. మహామంగళ హారతి, భజన కార్యక్రమాలు కొనసాగాయి. -
కేసీఆర్‌ను కలిసిన గాయని పి.సుశీల
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ప్రముఖ నేపథ్య గాయని పి.సుశీల సోమవారం హైదరాబాద్‌లో కలిశారు. విజయవంతంగా అయుత మహా చండీ యాగం నిర్వహించినందుకు ఆమె ... కేసీఆర్‌ను అభినందించారు. మరిన్ని మంచిపనులు చేయాలంటూ పి.సుశీల...ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. కేసీఆర్ ఈ సందర్భంగా సుశీలకు శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం కేసీఆర్, ఆయన సతీమణి శోభా ...సుశీలతో ఫోటో దిగారు. -
పి.సుశీల - స్టార్ స్టార్ సూపర్ స్టార్